భక్తి లేకపోతే యజ్ఞయాగాదులు కూడా నిష్ప్రయోజనం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు
యత్పుణ్యఫలం ప్రదిష్టమ్,అత్యేతి
తత్సర్వమిదం విధిత్వా యోగీ
పరం స్థానముపైతి చాద్యమ్ "
- భ.గీత 8:28
" ఈ రహస్యాన్ని ( భక్తిని ) తెలుసుకున్న యోగులు, వైదిక కర్మలు, వేదాల అధ్యయనం, యాగాలు, తపస్సులు మరియు దానధర్మాల యొక్క ఫలాలను మించిన పుణ్యాన్ని పొందుతారు. అటువంటి యోగులు పరమాత్మను చేరుకుంటారు " అన్నారు పరమాత్మ.
రామాయణం ఇలా తెలియచేస్తూంది:
" నేమ ధర్మ ఆచార తప
జ్ఞాన జగ్య జప దాన,
భేషజ పుని కోటిన్హ నహిం
రోగ జహిం హరిజన "
“మీరు సత్ప్రవర్తన, ధర్మం, తపస్సు, త్యాగాలు, అష్టాంగ యోగం, మంత్రాలు పఠించడం మరియు దానధర్మాలలో పాల్గొనవచ్చు. కానీ భగవంతుని పట్ల భక్తి లేకుండా, ఇతర విషయాలపై ఆసక్తి అనే మనస్సు యొక్క వ్యాధి ఆగదు " అని. భక్తి లేకపోతే మనస్సు అనవసరమయిన ఇతర వ్యాపకాల వైపు లాగబడుతూనే ఉంటుంది.
ఈ సత్యం గ్రహించిన యోగులు భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గించి భగవంతుని పాదాలపై దృష్టి పెడతారు.
త్యాగయ్య 13వ ఏటకే సంగీతసాధనలో మునిగిపోయారు. రామనామకీర్తనం తప్ప వేరే ధ్యాసే లేదు ఆయనకు. యాగాలు చేయలేదు, వేదపారాయణ లేదు, శాస్త్రపఠనం లేదు. మరి తరించారు, ముక్తి పొందారు. ఇది కేవలం రాముడి మీద భక్తితో సాధ్యమయింది.
వాగ్గేయకారులు పాడిన కీర్తనలు అన్నీ కేవలం భగవంతుని మెప్పుకోసం. ఇతరుల కోసం కాదు. అందుకే చిరస్మరణీయులు అయ్యారు. వారు చేసిన కీర్తనలు పాడి చరితార్థులవుతున్నారు సామాన్యులు కూడా.
ఇదే పరమాత్మ తెలియచేసినది. భక్తిలేకపోతే ఏ పూజలూ ఫలితాన్ని ఇవ్వవని.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment