తినే ఆహారానికి దోషం లేకుండా చూసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఆహారస్త్వపి సర్వస్య 

  త్రివిధో భవతి ప్రియః,

  యజ్ఞస్తపస్తథా దానం 

  తేషాం భేదమిమం శృణు "

             - భ.గీత 17:7

" ప్రజలు ఇష్టపడే ఆహారం వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. త్యాగం, కాఠిన్యం మరియు దాతృత్వం పట్ల వారు మొగ్గు చూపే విధం వారు తీసుకునే ఆహారంమీద ఆధారపడి ఉంటుంది‌ " అన్నారు పరమాత్మ.

ఎవరయినా గొడవ పడుతూన్నప్పుడు " మేమూ ఉప్పు కారం తింటున్నాం మరి " అనే మాటలు వింటూంటాం. అంటే ఉప్పు కారం తింటే కోపం తాపం అహం పెరుగుతాయి అని అర్ధమవుతూంది. 

అలాగే తినే ఆహారం దోషరహితంగా ఉండాలి. పండించే ప్రదేశం కూడా మంచిదయి ఉండాలి. మరి ఎక్కుడ పండించారో మనకు ఎలా తెలుస్తుంది. అందుకే ఆహారాన్ని భగవంతుడికి నివేదనచేసి తీసుకోవాలి. అలా నివేదన చేస్తే దోషం పోతుంది అని శాస్త్రోక్తం.

ఆహారం పవిత్రత వండేవారి మనస్తత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భగవంతుడికి నివేదన కోసం వండుతూన్నట్లుగా నిర్మలమైన మనస్సుతో వండాలి. 

ఎవరయినా భోజనానికి పిలుస్తే పిలిచినవారు ఆహారాన్ని లేదా దానికి ఉపయోగించే ధనాన్ని ఎలా సంపాదించారు అని కూడా ఆలోచించాలి. ప్రతీవారి ఇంటికీ భోజనానికి వెళ్ళకూడదు. 

కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తన భవనంలో ఉండి తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. వద్దని చెప్పి కృష్ణుడు విదురుడి ఇంట బస చేసారు. అటువంటి భోజనం చేస్తే మనస్సు, ఆలోచనలు కలుషితమవుతాయని తెలియచేసారు పరమాత్మ.

ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ