అసూయ లేకపోతే సహం బాధలు తగ్గుతాయి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 

" ఇదం తు తే గుహ్యతమం 

  ప్రవక్ష్యామ్యనసూయవే,

  జ్ఞానం విజ్ఞానసహితం 

  యజ్ఞాత్వా మోక్ష్యసే2శుభాత్ " 

                       - భ.గీత 9:1

" ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం " అన్నారు పండితులు. ఎంతటి అద్భుత ఉపదేశం పరమాత్మ ఇచ్చినది. ఏ సందేహం రాకుండా అన్ని విషయాలు స్వామి స్పష్టంగా చెప్పేసారు.

అసలు గీత అర్జునుడికే ఎందుకు చెప్పారు అనే సందేహం రావచ్చు. అందుకని ఈ " రాజవిద్య రాజగుహ్యం " అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే " అర్జునా , నీలో అసూయ అన్నది లేదు, అందుకనే ఈ ఉత్కృష్టమైన అత్యంతరహస్యమైన జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను " అన్నారు.

రెండవవాక్యం చివరిలో " ప్రవక్ష్యామి అనసూయవే " అన్నారు. ఈ అసూయ మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. జీవుడు భ్రష్టుడవడానికి మూలం అసూయే. అసూయ కలగగానే అక్కడితో ఆగదు. అసహనం, ఎలాగేనా పొందాలని కోరిక, కోపం, హింస ఒక్కొటొక్కటిగా పెరిగిపోతాయి.

ఆశ్చర్యకరంగా మూడవ వాక్యంలో " జ్ఞానం విజ్ఞానసహితం " అన్నారు స్వామి. సాధారణంగా అందరూ ఈ రెండూ " జ్ఞానం , విజ్ఞానం " ఒకటే అనుకుంటారు. జ్ఞానం అంటే " వాచా/పుస్తక " జ్ఞానం. విజ్ఞానం అంటే అనుభవజ్ఞానం. పుస్తకజ్ఞానమే సరిపోదు. అనుభవ ( ప్రాక్టికల్ ) జ్ఞానం ఎంతో అవసరం. ఆ అనుభవసారమే మన సనాతనధర్మం. అదే ప్రపంచశాంతికి దిక్సూచి.

ఈ అధ్యాయానికి " రాజవిద్య రాజగుహ్యం " అనే పేరే అత్యద్భుతం. రాజ అంటే " ఉత్కృష్టం/అత్యంత ఉన్నతం " అని అర్ధం. అంటే ఇంతకన్నా విలువైనది లేదు అని తెలుసుకోవాలి. దీనిలో జీవుడు తరించడానికి కావలిసిన సమాచారమంతా ఉంది.

ఋషులు మనకు ఎంతటి అద్భుత వాజ్మయం/సంపద ని ఇచ్చారు. అటువంటి వాజ్మయంని గౌరవించుకుందాం, కాపాడుకుందాం. ఇది అందరి బాధ్యత.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ