MitoChondria - శక్తిస్వరూపిణి అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

ఆదిశంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని ఇది స్తుతిస్తారు:

" శివః శక్త్యా యుక్తో యది 

  భవతి శక్తః ప్రభవితుం

  న చేదేవం దేవో న ఖలు 

  కుశలః స్పందితుమపి ।

  అతస్త్వామారాధ్యాం 

‌  హరిహరవిరించాదిభిరపి

  ప్రణంతుం స్తోతుం వా 

  కథమకృతపుణ్యః ప్రభవతి"

                   - శ్లోకం 1

" సమస్త శక్తిస్వరూపిణివగు ఓ జగన్మాతా! మంగళకారుడగు ఈశ్వరుడు శక్తి(నీ)తో కలిసి ఉండడంవల్ల సృజించుటకు సమర్ధుడగు చున్నాడు. అలా కాకపోతే కదలడానికి కూడా అశక్తుడే అగుచున్నాడు ".

ఎంత అద్భుతం మన వాజ్మయం.

ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెపుతూన్నది, మనందరికీ తెలిసినది ఏమిటంటే బిడ్డకు 50% డిఎన్ఎ తల్లినుంచి, 50% తండ్రినుంచీ వస్తుందని.

ఇప్పుడు కొత్తగా కనిపెట్టినది ఏమిటంటే మన డిఎన్ఎ లో " మైటోకాండ్రియా " అనే పరమాణువు ఉందని. అదే మనకణాలకు అంటే మనకు శక్తిని ఇస్తూందని. ఇంకా తెలుసుకున్నదేమిటంటే ఈ శక్తిని ఇచ్చే పరమాణువు బిడ్డకు అమ్మనుంచి వస్తుందని. అంటే బిడ్డలకు శక్తిని ఇస్తూన్నది తల్లే అని తెలుస్తూంది.

లక్షల పోనీ అందరూ ఒప్పుకున్నట్లుగా వేల సం.ల క్రితమే మన ఋషులు స్త్రీని శక్తిస్వరూపిణి అంటే శక్తినిచ్చేదిగా భావిస్తూ గౌరవించుకున్నారు, మనకు అలా పూజించమని తెలియచేసారు.

శివుడికి కూడా శక్తినిచ్చేది అమ్మవారే అని చెబుతూంది సనాతనధర్మం.

సైన్స్ వృద్ధి అయే కొలదీ మన ఋషుల అద్భుతవిజ్ఞానం, మన సనాతనధర్మం గొప్పదనం ప్రపంచానికి మెల్లిమెల్లిగా తెలిసి వస్తూంది.

అమెరికా పండితుడు " మీనార్డ్ " మన దేశానికి వచ్చినప్పుడు అమెరికా గ్రంధాలయాల్లో 6700 సంస్కృతలిఖితగ్రంధాలు ఉన్నాయని వాటిమీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని తెలియచేసారు.

కొలంబియా, షికాగో, వాషింగ్టన్ " యూనివర్శిటీలలోనూ, జర్మనీలోనూ భాషాశాస్త్రాలపై పరిశోధనలు చేస్తూన్న భాషాపండితులు ప్రపంచంలో ఉన్న పదాలన్నిటికీ కూడా సంస్కృతపదాలే మూలం అన్నట్లుగా తెలుస్తూంది అనే నిర్ణయానికి వచ్చేరుట.

మన అద్భుతమైన విజ్ఞానంమీద మనకు ఎలాగూ గౌరవం లేదని వారు తెలుసుకుని, మన సంస్కృతం నేర్చుకుని మరీ మన ప్రాచీన గ్రంథాలలోని విషయాలను బయటకుతీసి అవే విషయాలను వారు కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రపంచానికి, మనకు తెలియచేస్తున్నారు.

భౌతికం, రసాయనికం, గణితం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ఏ పరిశోధనలు చూసినా మూలాలు మన సనాతనవాజ్మయంలో కనబడుతున్నాయి.

మన అద్భుత విజ్ఞానాన్ని, వాజ్మయాన్ని గౌరవించుకుందాం, కాపాడుకుందాం.

అమ్మవారు " మహాశక్తి స్వరూపిణి ".

హమారా సనాతనధర్మ మహాన్.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ