అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దుర్గమా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 189 వ నామం . 

" దుర్గమా " అంటే తెలియశక్యము కానిది అని అర్ధం. అమ్మవారు మాయాప్రకృతి. మాయ అంటే తెలుసుకోలేనిది లేక ఊహించలేనిది అని అర్ధం. అమ్మవారి సృష్టిలోని వింతలు అర్ధం చేసుకోవడం అంత సులభమా. సృష్టిలోని కొన్ని జంతువులు, వృక్షాల గురించి నేటికీ మానవులకు తెలియదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

కొన్ని చిన్న పనులు కూడా ఎంత ప్రయత్నించినా అవవు. ఆశ్చర్యం వేస్తుంది. అమ్మవారి ప్రణాళిక వేరుగా ఉంటుంది. అది అవడం వల్ల భవిష్యత్తులో బాధపడవలసి రావచ్చు. అందుకే అది అవకపోవడం. చాలా సందర్భాలలో మనం ఆ పని అప్పుడు అవకపోయినా బావుండును, ఈరోజు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అని అనుకోవడం కద్దు.

ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:

" గిరా మాహు ర్దేవీం.............

  ........ మహామాయా విశ్వం 

  భ్రమయసి పరబ్రహ్మ మహిషీ " 

" ఓ బ్రహ్మస్వరూపిణీ, వేదాంతులు నిన్ను బ్రహ్మ భార్య వాణిగానూ, హరి భార్య లక్ష్మిగానూ, హరుని భార్య ఉమగానూ చెబుతున్నారు. నువ్వు ఆ ముగ్గురినీ అతిక్రమించిన దానవై గొప్పమహామగల మాయాప్రకృతివై లోకాన్ని భ్రమింపచేస్తున్నావు " అని ప్రార్థించారు శంకరులు. 

అమ్మవారు త్రిగుణాలకు అతీతం, తురీయం. అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే. అన్నీ అమ్మవారే చూసుకుంటారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ