అమ్మవారి అనుగ్రహం లభించడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దుర్లభా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 188 వ నామం .

" దుర్లభా " అంటే పొందశక్యము కానిది అని అర్ధం చెప్పారు కాని సులభంగా పొందగలిగేవారు కాదు అమ్మవారు అని తెలుసుకోవాలి. సాధన కొంచెం ఎక్కువగా చేయవలసి ఉంటుంది.

మూకశంకరులు వారి ఆర్యాశతకములో కామాక్షీదేవిని ఇలా ప్రార్థిస్తారు:

" చింతితఫలపరిపోషణ

  చింతామణిరేవ కాంచినిలయా మే,

  చిరతరసుచరితసులభా  

  చిత్తం శిశిరయతు చిత్సుధాధారా "

                    - ఆర్యాశతకం:3

అమ్మవారు కోరిన కోరికలు అన్నీ తీర్చే చింతామణిట‌. ఎప్పుడు అంటే " చిరతరసుచరిత " అన్నారు. అంటే చిరకాలము చక్కగా భక్తిగా సేవచేసుకుంటే అమ్మవారు సులభంగానే అనుగ్రహిస్తారు అని.

ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:

" త్రయాణాం దేవానాం  త్రిగుణ..............

   .........‌...ముకిళితకరో త్తంస మకుటాః "

శంకరులు " నీ త్రిగుణాల చేత పుట్టిన త్రిమూర్తుల పూజ అంటే నీ పాదపూజే కదమ్మా. నువ్వు పాదాలు పెట్టుకునే రత్నపీఠం దగ్గరే కదా త్రిమూర్తులు చేతులు జోడించి శిరస్సులు వంచి కూర్చుని ఉంటారు " అన్నారు.

సృష్టి స్థితి లయలు చూసే త్రిమూర్తులే అలా సాధన చేస్తూంటే భూలోక భక్తుల సాధన ఏరకంగా ఉండాలో ఊహించుకోవచ్చు. 

అందుకే శంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ " నా జానే విలపనం - నాకు ఏడవడం కూడా రాదమ్మా " అని ప్రార్థించారు. పిల్లవాడు తను కోరింది తల్లి ఇవ్వకపోతే ఏడుస్తారు, తల్లి వెంటనే ఇస్తుంది. ఏడవడం కూడా రాదన్నారు శంకరులు. అలా శరణాగతి పొందాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. చాలా సరళమైన వివరణ. నమస్తే

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ