తత్రం అంటే తంతు, కార్యక్రమం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మహాతంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 226 వ నామం. 

" మహాతంత్రా " అంటే తంత్రస్వరూపురాలు. తంత్రం అంటే తంతు, పని. పనే దైవం అంటారు. ఏదయినా పని మొదలుపెడితే కార్యక్రమం చాలానే ఉంటుంది.

" త్రాసాత్ త్రాణాత్ తంత్రః " - భయాలనుంచి రక్షించేది తంత్రం. మనం చేసే పూజలు జపాలు అన్నీ తంత్రం. దీనికి మంత్రాలు, యంత్రాలు అవసరమవుతాయి.

ఋగ్వేదంలో ఇలా ఉంది:

" నరుతే శ్రాంతస్య సఖ్యాయదేవాః " 

అంటే " ఎవడైతే కష్టపడడో వానికి దేవుడు కూడా సహాయపడడు " అని.

అంటే శ్రద్ధగా మనసుపెట్టి పనిచేసేవారికి దేవతలు సహాయపడతారు అని అర్ధం. 

మన పూర్వీకులు ఏపని అయినా ఎంత ఇష్టంగా ప్రత్యేకశ్రద్ధతో చేసేవారో తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడక్కరలేదు. మన గుడులు, స్థూపాలూ చూస్తే చాలు.

మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం కట్టి 2500 సం.లు, తంజావూరు బృహదీశ్వరాలయం కట్టి 1000 సం.లు అయింది. విష్ణుధ్వజం ( ఇప్పుడు కుతుబ్ మినార్ అంటున్నారు ) కట్టి కనీసం 1000 సం.లు అయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే ఉంటాయి. కట్టి 150 సం.లు కూడా కాని ఈఫిల్ టవర్ అప్పుడే తుప్పు పడుతూంది అన్న వార్త చదివాం. కాని ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉన్న విష్ణుధ్వజం కట్టడానికి ఏ లోహాలు వాడారో కూడా తెలుసుకోలేక పోతున్నారు.

వీటిని వాస్తుశాస్త్రం ప్రకారం కట్టేవారు. కొలతలకు అంగుళం ప్రాతిపదిక. ఇప్పటి అంగుళం కాదు. దాత యొక్క కుడిచేయి అనామిక ( ఉంగరంవేలు) మధ్య కణుపుని అంగుళంగా తీసుకుని చక్కటి కొలతలతో శాస్త్రీయంగా కట్టేవారు. అందుకే ఏ కట్టడమయినా దైవత్వం ఉట్టిపడుతూ ఉండేది. ఏ చిన్న పని అయినా యజ్ఞంలా శ్రద్ధగా మనసుపెట్టి చేసేవారు. 

పనిచేసే కార్యాలయాన్ని దేవాలయంగా గౌరవించమన్నారు. మంచిపని జరిగేచోట అమ్మవారు కొలువై ఉంటారు. 

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే కష్టపడే తత్వాన్ని అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ