అమ్మవారి చైతన్యం ఎంత చిన్న జీవిలోనైనా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సూక్ష్మరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 467 వ నామం .

" సూక్ష్మరూపిణీ " అంటే తెలియశక్యముకాని రూపముకలది. ఆశ్చర్యంగా ఉంటుంది. అమ్మవారు " సహస్రశీర్షవదనా సహస్రాక్షా సహస్రపాత్ " - విరాడ్రూపిణి. మరి సూక్ష్మరూపిణి ఏమిటి.

చిన్న విత్తనం ప్రాతితే మర్రి మహావృక్షం అవుతూంది. అమ్మవారి అంశ/చైతన్యం చిన్న చిన్న కంటికి కనిపించని క్రిమికీటకాలలో కూడా ఉంటుంది. అంటే ఆ చైతన్యం ఎంత సూక్ష్మం అయిఉంటుంది.

సృష్టి కార్యక్రమానికి, అవసరమయినప్పుడు అమ్మవారు సూక్ష్మరూపాన్ని ధరిస్తారు.

ఈ సూక్ష్మరూపం గురించి విన్నప్పుడు మనకు హనుమ జ్ఞాపకానికి వస్తొరు. సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకకు చేరుకుంటారు హనుమ. చీకటిపడే వరకూ ఆగి సూక్ష్మరూపంలో మెల్లిగా నగరప్రవేశానికి బయలుదేరుతారు. అప్పుడు హనుమ చిన్న " పిల్లిపిల్ల " లా ఉన్నారు అన్నారు వాల్మీకి. 

" ఏయ్ ఆగు " అన్నారు ఎవరో. తల పైకెత్తి చూస్తే రాక్షసి లంఖిణి కనిపించింది. ఎక్కడికి పోతున్నావు అంటే హనుమ " అందరూ లంకానగరం అందంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. చూసి ఆనందించడానికి వెడుతున్నాను " అన్నారు. " వెళ్ళడానికి వీల్లేదు, ఫో " అని హనుమ వీపుమీద గట్టిగా కొట్టింది. హనుమకు ఆగ్రహం తెప్పించింది ఆ దెబ్బ. స్త్రీ కదా పైగా అనవసరపు గొడవలెందుకు అని మెత్తగా మాట్లాడుతూంటే ఇలా కొడుతుందా అని లంఖిణి కన్నా ఎత్తుగా ఎదిగిపోయి లంఖిణి తలమీద ఒక్క దెబ్బ వేయడం, రాక్షసి రక్తం కక్కుకుని పడిపోవడం జరిగింది. హనుమ సూక్ష్మరూపంలో లంకా ప్రవేశం చేసారు.

అమ్మవారు అవసరమయినప్పుడు సూక్ష్మరూపాన్ని కూడా తీసుకంంటారు. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ