గుడికి వెళ్ళేది విగ్రహం చూడడానికి కాదు, విగ్రహంలోని దేవుడిని చూడడానికి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మహాయంత్రా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 228 వ నామం.
" మహాయంత్రా " అంటే ప్రార్ధించడానికి ఒక సాకారవస్తువు. అది విగ్రహం కాని బీజాక్షరాలతో కూడిన లోహరేకు అవచ్చు.
" విశేషేణ గ్రహతి ఇతి విగ్రహం " - విగ్రహము అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి.
త్రయం అంటే తంత్రం మంత్రం యంత్రం. సాధనలో మనస్సు నిలకడగా ఉండాలంటే విగ్రహం అవసరం ఎంతయినా ఉంది. సాధన సులభమవుతుంది. కళ్ళుమూసుకుని ధ్యానం చేస్తే మనస్సు మాటిమాటికీ ఎక్కడెక్కడకో పోతూ ఉంటుంది. దాన్ని లాక్కొచ్చి కూర్చోపెడుతూ ఉండాలి.
ఈ త్రయం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఉ.దాకు నమకం ( మంత్రం ) తెలుసు. పారాయణ ఫలితం వేరు. అదే లింగం ( యంత్రం ) మీద నమకం ( మంత్రం ) చదువుతూ పాలు పోస్తే ( తంత్రం ) లభించే ఫలితం వేరు.
విగ్రహంని శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ట చేస్తారు. అప్పుడే అది యంత్రం అవుతుంది.
వివేకానందుడు " మేము విగ్రహానికి నమస్కరించం. విగ్రహం లోని దేవుడికి నమస్కరిస్తాం " అని తెలియచేసేవారు.
కంచి కామాక్షి, మధుర మీనాక్షి, వైష్ణోదేవి, కొల్హాపూర్ మహాలక్ష్మి వంటి విగ్రహమూర్తులను చూస్తే చాలు మనస్సు ప్రశాంతంను పొందుతుంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment