కోరికలు ఎక్కువయితే కోపం పెరిగి ఆరోగ్యం చెడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నిష్క్రోధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 168 వ నామం.

" నిష్క్రోధా " అంటే క్రోధము లేనిది అని అర్థం. కోరిక కలిగి తీరకపోతే క్రోధం/కోపం కలగడం సహజం. అమ్మవారికి కోరిక ఏమి ఉంటుంది. అమ్మవారు పొందిందీ లేదు, పొందవలసినదీ ఏమీ లేదు. అందుకే ఆవిడకు క్రోధం ఉండదు.

ఎదుటివారు మనకు నచ్చనట్లు ప్రవర్తిస్తే మనకు కోపం వస్తుంది. అమ్మవారికి అటువంటి భావన ఉండదు. మన కర్మఫలాలు మనమే అనుభవించాలి. మన ధర్మాధర్మాలకు అమ్మవారు సంతోషించరు, బాధపడరు. కోపానికి తావెక్కడ.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" ధ్యాయతో విషయాన్ పుంసః      

‌  సంగస్తేషూపజాయతే,

  సంగాత్ సంజాయతే కామః    

  కామాత్ క్రోధో2భిజాయతే " 

               - భ.గీత 2:62

" విషయచింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును.  ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును.  ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును " అని. 

ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. తనకే స్వంతం అవాలనుకుంటాడు. ఇంకొకరికి ద్రక్కకూడదు అనుకుంటాడు. కోరిక తీరనప్పుడు కోపంతో రగిలిపోతాడు. ఎంతకయినా తెగిస్తాడు. సమస్యలలో కూరుకుపోతాడు.

కోరిక ధర్మబద్ధంగా ఉన్నా, కోరికలు తగ్గించుకున్నా జీవితం సుఖంగా ఉంటుంది. 

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అటువంటి స్థితిని కలుగచేస్తారు. జీవితం సుఖమయం చేస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ