భోగి పండుగ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

భోగి " భోగ " అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం/ఆనందం. అష్టైశ్వర్యాలు లాగే అష్టభోగముల గురించి కూడా చెబుతూంటారు.

గోదాదేవి ఈరోజునే శ్రీరంగనాథునిలో ఐక్యమయి భోగాన్ని పొందిందని పురాణకధనం. వామనపురాణంలో బలిని పాతాళానికి పంపించిన తరువాత వామనుడు బలికి వరమిస్తారు. సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి అందరినీ ఆశీర్వదించమని. మనం వేసే భోగిమంటలు బలిని ఆహ్వానించడానికే. ప్రతీ పండుగకు ఓ అద్భుతమయిన పురాణకధనం. ఎంత అద్భుతం మన సంస్కృతి.

భోగి, సంక్రాంతి పండుగులగురించి పూజ్యులు గరికిపాటి వారు కొన్ని అద్భుత విషయాలు తెలియచేసారు. 

భోగి అంటే సంస్కృతంలో " తయారు/ప్రిపరేషన్ " అని కూడా అర్ధంట. ఏ పండుగకైనా ముందరరోజే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉగాది అనుకోండి - వేపపువ్వు, మామిడికాయ, చెరకుముక్కలు లాంటివి ముందరరోజే ఏర్పాటు చేసుకుంటాం. దీపావళి అయితే చెప్పనక్కరలేదు. టపాసులు, అమ్మవారిపూజకి ఎక్కువగా పువ్వులు స్వీట్స్ మొ.గు నవి ఏర్పాటుచేసుకోవాలి. దసరాలయితే అమ్మవారి పూజలకి దండలు వత్తులు పూలు తప్పనిసరి. అంటే ఏ పండుగకైనా ముందరరోజుని " భోగి " అనే పిలుస్తారు/చేసుకోవాలి.

మరి కనుమ ఏమిటి. గ్రామాల్లో గ్రామదేవత తీర్థాలు జరుగుతాయి ఏడాదికి 2 సార్లు. మ్రొక్కులు తీర్చుకోవడానికి పిల్లలు బంధువులు కూడా వస్తారు. మరునాడు ప్రయాణం పెట్టుకోరు. ఎందుకంటే " కనుమ " కదా అంటారు. అంటే ఏ పండుగైనా మరునాడు కనుమ అవుతుంది. 

అంటే సంక్రాంతి యే అసలు మరియు ముఖ్యమైన పండుగ. దీనిని " పెద్దపండుగ " అంటారు. కాని పెద్దల పండుగ అని పిలవాలి. పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం, పితృదేవతలకు తర్పణాలు మొదలైనవి చేయడం లాంటివి చెయ్యాలి.

పంటలు చేతికొచ్చే సమయం, పిల్లలు బంధువులు వస్తారు కనుక మరీ ఒకరోజు కాకుండా భోగి సంక్రాంతి కనుమ అని 3 రోజులు పండుగలు చేసుకునే " సంప్రదాయం " మొదలయి ఉంటుంది. కనుమ కూడా పండుగ కనుక ప్రయాణాలు చేయకూడని రోజుగా " ముక్కనుమ " ని చేర్చి ఉండవచ్చు.

పండుగ అంటేనే బంధువులు నలుగురు కలిసి సరదాగా ఆనందంగా జరుపుకోవడం కనుక దీనిలో తప్పుపట్టడానికి ఏమీ లేదు. అందుకేనేమో " రిపబ్లిక్ డే " ని కూడా 23 నుంచీ జరుపుకోవాలని నిర్ణయించారుట, ఏర్పాట్ల కోసం. 

అందరికీ " భోగి "పండుగ  శుభాకాంక్షలు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ