సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కామకోటికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 589 వ నామం.
" కామకోటికా " అంటే ఏకదేశముగా గలది. దేశము అంటే శరీరము. కామ అంటే పరమశివుడు. పరమశివుని శరీరమే శరీరముగా గలది. అర్ధనారీశ్వర రూపం.
కంచిపీఠాన్ని " కంచి కామకోటి పీఠం " అని పిలుస్తారు. అమ్మవారు కామాక్షీదేవి కోరికలను కంటిచూపుతో తీరుస్తారు. కామాక్షీదేవి అనుగ్రహించలేనిది లేదు.
మూకశంకరులు మూకపంచశతిలోని ఆర్యాశతకంలో కామాక్షీదేవిని ఇలా కీర్తిస్తారు:
" కామపరిపంథికామిని కామేశ్వరి
కామపీఠమధ్యగతే,
కామదుఘా భవ కమలే
కామకలే కామకోటి కామాక్షి"
- శ్లోకం 49
" కామపీఠము మధ్యనున్నదానా, లక్ష్మీస్వరూపము గలదానా కోట్లాది కామములు నీయందున్నవి. భక్తుల కోరిన కోర్కెలు అనుగ్రహించుదానవు. నీవు నా కోర్కెలు తీర్చు తల్లీ " అని.
ఈ శ్లోకంలో అమ్మవారిని " కామకోటి " అన్నారు మూకశంకరులు. కోట్లకొలదీ కోరికలు ఉంటాయిట అమ్మవారి దగ్గర, భక్తులకు ఇవ్వడానికి. ఏది కోరినా లేదనరు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. కామాక్షీదేవిని అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment