అమ్మవారికి భక్తులమీద అపారమయిన కరుణ/దయ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" దయామూర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 581 వ నామం.
" దయామూర్తిః " అంటే దయయే స్వరూపముగా గలది.
తల్లికి బిడ్డలమీద దయ, ప్రేమ తప్ప వేరే భావనలు ఎందుకుంటాయి. " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి " అన్నారు శంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ. సృష్టిలో చెడ్డతల్లి ఉండనే ఉండదు అని.
రాసలీలకు ముందు " కృష్ణా, మిమ్మల్ని ఓ విషయం అడగవచ్చా " అని అడుగుతారు గోపికలు. కృష్ణుడు " అడగండి " అనగానే వారు అంటారు:
ఈ ప్రేమలు ఆశ్చర్యకరంగా ఉంటాయి:
1. ఎదుటి వారు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు కొందరు.
2. ఎదుటి వారు ప్రేమించకపోయినా
ప్రేమిస్తారు కొందరు.
3. ఎదుటి వారు ప్రేమించినా,
ప్రేమించకపోయినా
ప్రేమించరు కొందరు.
ఈ ముగ్గురిలో మీరు ఎవరు అని అడుగుతారు కృష్ణుడిని. ఎంత చక్కటి ప్రశ్న.
కృష్ణుడు అద్భుతమయిన వివరణ ఇస్తారు గోపికల ప్రశ్నకు:
1. మొదటివారిది పశువు/జంతు ప్రేమ. తమకు ఉపయోగపడతారు, ప్రయోజనమవుతారు అనే వారినే ప్రేమిస్తారు. ఆవులు, కుక్కలు లాంటి జీవుల్ని పెంచుకునేది, వాటికి పేర్లు పెట్టుకుని ముద్దుగా పిలుచుకునేది వీరే.
2. రెండవరకం వారిది తల్లిదండ్రుల ప్రేమ. భవిష్యత్తులో పిల్లలు ప్రేమిస్తారు, ఉపయోగపడతారు అనే ఆలోచన ఉండదు వీరికి. నిరపేక్షులు.
3. మూడవరకంలో మళ్ళీ 4 రకాల వారు ఉంటారు. వీరు అకృతజ్ఞులు, గురుద్రోహులు, ఆత్మరాములు, ఆత్మకాములు. తల్లిదండ్రులను, గురువులను ఉపయోగించుకుంటారు కాని ప్రేమించరు మొదటి ఇద్దరు. తమలో తామే ఆనందించేవారికి, కోరికలు లేని వారికీ భౌతికవిషయాలు ఏమీ పట్టవు. ఎదుటి వారు ప్రేమించినా ప్రేమించకపోయినా వీరు పట్టించుకోరు. ఈ నలుగురిలో మొదటి ఇద్దరు నికృష్టులు, మిగతా ఇద్దరూ ఉత్కృష్టులు.
అని చెప్పి ఇలా తెలియచేసారు:
" నాహం తు సఖ్యో భజతోఽపి జంతూన్
భజామ్యమీషామనువృత్తి వృత్తయే,
యథాధనో లబ్ధధనే వినష్టే
తచ్చింతయాన్యన్నిభృతో న వేద "
-10(1):31:20
" పైవారిలో నేను ఎవరినీ కాను. ఎందుకంటే నాకు కరుణ ఒక్కటే తెలుసు. నా భక్తుల మీద నాకు అపారమయిన కరుణ/దయ. ఈ భౌతిక బంధాలన్నిటినీ త్రెంచుకుని నన్ను ఆశ్రయించిన భక్తులకు అఖండ ఖ్యాతిని, ముక్తిని కలుగచేయడమే నా పని " అంటారు కృష్ణుడు.
అవ్యాజకరుణామూర్తి అమ్మవారు. భక్తులను సదా కాపాడుతూ, వారిని తరింపచేయాలనే చూస్తూ ఉంటారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Sir
ReplyDeleteI am Patnala Venkateswara Rao, retired Chief Manager. Mobile No.9866551347.
I am a regular reader of your postings. Only great persons like you who have purva janma sukruti only can have this much devotion. Please continue to post. If possible please make a booklet of these postings periodically. Thanks once again Sir.