భక్తుల సమక్షం అమ్మవారికి పరమానందం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పరమోదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 940 వ నామం. 

" పరమోదా " అంటే ఉత్కృష్టమైన సంతోషం గలది. పర అంటే అధికమయిన, మోదా అంటే సంతోషం. 

భక్తులంటే అమితమయిన ప్రీతి, ప్రేమ అమ్మవారికి. ఎక్కడ పూజలు జరుగుతూన్నా, కీర్తనలు పాడడం, భజనలు చేయడం జరుగుతూన్నా అమ్మవారు అక్కడ ఉండి ఆనందిస్తూ ఉంటారు. తనను నమ్ముకున్న వారిని సదా సంతోషంగా ఉండేలా చూస్తూంటారు కూడా అమ్మవారు. ఆనందరూపిణి.

తనను చూడడానికి వచ్చిన కుచేలుడిని గాఢంగా ఆలింగనం చేసుకుంటారు కృష్ణుడు. అప్పటివరకూ రుక్మిణీదేవితో కలిసి తను కూర్చున్న హంసతూలికా తల్పంపై కూర్చోపెట్టుకుని గురుకులంలో మనం గడిపిన రోజులు ఎంత బాగుండేవో కదా, ఎలా మర్చిపోగలం ఆ రోజులను అంటారు కృష్ణుడు కుచేలుడితో. ఓ సంఘటన గుర్తు చేసి జ్ఞాపకం ఉందా అని అడుగుతారు. 

ఓ రోజు గురువుగారి పూజకు పత్రి పూలు సమిధలు తేవడానికి అరణ్యానికి వెడతారు కృష్ణుడు కుచేలుడు. భయంకరమయిన వర్షం కురుస్తుంది. వర్షం వెలిసే సమయానికి చీకటి పడుతుంది. దారి తప్పుతారు, ఎలా తిరిగి వెళ్ళాలో తెలియదు. ఆ సమయంలో గురువుగారు ఓ దీపంని పట్టుకుని వీరిని పేర్లతో పిలుస్తూ వస్తారు. చిన్నపిల్లలు మిమ్మల్ని ఇలా పంపించి తప్పు చేసాను అని బాధపడి మీకు భవిష్యత్తులో సంపదలకు, కీర్తికి, ఆనందానికి లోటు ఉండదు అని ఆశీర్వదిస్తారు.

గురువుగారి ఆశీర్వాదం పొల్లు పోదు, మనకు సంపదలు లభిస్తాయి అని కృష్ణుడు అంటే కుచేలుడు అంటాడు " గురువుల ఆశీర్వాదం ఫలించాలన్నా జగద్గురువు ( నీ ) అనుగ్రహం ఉండాలి కదా " అని.

కుచేలుడికి తెలుసు కృష్ణుడు పరమాత్మ, ముక్తిప్రదాత, భక్తవత్సలుడు అని. అయినా కృష్ణుడు మామూలు స్నేహితుడులాగ ప్రవర్తిస్తూ కుచేలుడిని ప్రక్కన కూర్చోపెట్టుకుని రాత్రంతా కబుర్లు చెప్పారు. భక్తులను, తనను నమ్ముకున్న వారిని సదా సంతోషంగా ఉండేలా చూస్తూంటారు. 

భక్తుల సమక్షం అమ్మవారికి పరమానందం కలిగిస్తుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ