సత్యభాషణం అమ్మవారికి ఇష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సత్యరూపా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 818 వ నామం. 

" సత్యరూపా " - అంటే " సత్యమే రూపముగా గలది " అని అర్ధం. సత్యస్వరూపిణి. సత్యంలో కొలువై ఉంటారు అమ్మవారు.

శంకరాచార్యులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడం అనగా బ్రహ్మ ఎరుక కలిగి ఉండడమే సత్యం.

ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తుంది. దానిలో మొదటిది సత్యం. సత్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఎప్పటికీ మార్పు ఉండదు. ధర్మం అలాకాదు - దేశ కాల వర్ణ ఆశ్రమాల్లో మారుతూ ఉంటుంది. ఒకదేశంలో ధర్మమైనది ఇంకో దేశంలో ధర్మం అవాలనిలేదు, ఒకసమయంలో ధర్మమైనది ఇంకోసమయంలో ధర్మం కాకపోవచ్చు. కాని సత్యం మాత్రం ఏకాలంలో అయినా ఎక్కడయినా ఒకేలా ఉంటుంది. 

వశిష్టులు రామాయణంలో అంటారు " సత్యం వదత, న అనృతం " - సత్యమే మాట్లాడాలి అని. అదీ మన సనాతనధర్మం గొప్పదనం. 

అందుకే రామకృష్ణపరమహంస " ఈ కలికాలంలో యజ్ఞాలు, పూజలు, తపాలు, జపాలు మొగునవి చెయ్యడం కష్టమే కనుక సత్యం మాట్లాడడమే ముఖ్యమైన వ్రతం " అన్నారు.

ఈ కలికాలంలో సత్యం మాట్లాడినా కష్టాలు కలుగుతూన్నా అబద్ధం మాట్లాడడం వలన కష్టాలు ఎక్కువగా కలుగుతాయి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, అలా చేస్తూ ఉండవలసి వస్తుంది. సత్యం ఎప్పుడూ ఒకటే కనుక అంత కష్టపడనక్కరలేదు. 

సత్యమే అమ్మవారి రూపం కనుక సత్యం మాట్లాడితే అమ్మవారి పూజ చేసినట్లే అని తెలుసుకోవాలి. 

ఈరోజు పవిత్రమయిన షట్తిల ఏకాదశి. నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించే రోజు ( షట్ + తిల ). 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ