సంతోషంగా గడపాలంటే సంతృప్తి ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సదాతుష్టా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 921 వ నామం.

" సదాతుష్టా " అంటే ఎల్లప్పుడూ సంతోషము గలది. అమ్మవారు సంతోషంగా ఉంటేనే మనల్ని సంతోషపెట్టగలరు.

" పద్మపత్రమివాంభసా " - అమ్మవారు తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు. మన కర్మలు చూసి అమ్మవారు సంతోషపడరు, బాధపడరు. కాని అమ్మ కదా. పిల్లలు మంచిపనులు చేసి వృద్ధిలోకి వస్తే సంతోషిస్తారు. 

మనం నిత్యపూజ చేసేటప్పుడు " పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరముద్దిస్య " అని సంకల్పం చేస్తాం. మన పూజ మన కోసమే కాకుండా పరమేశ్వరుడి సంతోషం కోసం కూడా. 

సంతోషంగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మంచి, చెడు కూడా శాశ్వతం కావు. అందుకని మంచి జరిగినప్పుడు పొంగిపోవడం, చెడు కలిగినప్పుడు బాధపడిపోవడం చేయనక్కర్లేదు. మన కోరిక నెరవేర్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయాలి. ఎంత కష్టపడినా పని అవనప్పుడు " మన ప్రాప్తం " అంతే అనుకుని ఆ విషయం వదిలేసి ముందుకు సాగిపోవాలి. అంతేకాని దాని గురించే బాధపడుతూ కూర్చోకూడదు.

సంతోషం సగం బలం అని నానుడి.

" అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 ) " అన్నారు పరమాత్మ. ఎప్పుడూ ఏదో దాని గురించి బాధపడుతూ అశాంతిగా ఉండేవాడికి సుఖం/సంతోషం ఎక్కడిది.

మనం అమ్మవారికి సంతోషం కలిగించే కర్మలనే చేస్తూ అమ్మవారి అనుగ్రహంని పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ