" అమ్మవారు గొప్పదానను అని భావించడంలో ఆశ్చర్యం ఏముంది " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మానవతీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 931 వ నామం . 

" మానవతీ " అంటే నేను గొప్పదానను అను అభిమానము గలది అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు. 

అమ్మవారు గొప్పవారు అని భావించడానికి సందేహమేముంటుంది. 84 లక్షల జీవరాశుల బాగోగులను ఒంటిచేత్తో గమనిస్తూ అనుగ్రహిస్తున్నారు. సృష్టి అంతా చిత్రవిచిత్రాలే. ఊహకందని సంఘటనలు. కోట్ల సంవత్సరాలు అయినా ఇప్పటికీ సృష్టిలో ఇంకా తెలియని విషయాలు ఎన్నో.

శ్రీసూక్తంలో అమ్మవారిని ఇలా స్తుతిస్తాం:

" ధనమగ్నిర్ధనం వాయుః 

  ధనం సూర్యో ధనం వసుః, 

  ధనమిన్ద్రో బృహస్పతిః

  వరుణం ధనమశ్ను తే "

" అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు - అందరూ తమతమ సంపదలను నీ అనుగ్రహంతో అనుభవిస్తున్నారు తల్లీ " అని. ఇక్కడ సంపదలు అంటే శక్తులు అని కూడా భావం.

వరాహ పురాణం ఇలా తెలియచేస్తూంది:

" రౌద్రీ తపోరతా దేవీ తామసీ 

  శక్తిరుత్తమా సంహారకారిణీ 

  నామ్నా కాలరాత్రిం చ తాం విదు "

" మృత్యువుకే భయకారిణి, ప్రళయకాలంలో యముని కూడా నశింపచేయునది అయినది కాలరాత్రి అమ్మవారు " అని. 

అటువంటి అమ్మవారు గొప్పదానను అని భావించడంలో ఆశ్చర్యం ఏముంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ