మహాకుంభ్ కి వెళ్ళలేకపోయామని బాధపడనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
మహాకుంభ్ కి వెళ్ళలేకపోయామే అని బాధపడనక్కరలేదు.
భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.
భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం లేనివారు ) అయినప్పటికీ కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఓ శరత్కాలపురాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కురిపిస్తూన్నప్పుడు శ్రీకృష్ణుడు ఓ కల్పవృక్షం వద్ద నిలుచుని వేణుగానం చేస్తున్నారు.
గోపికలు ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెత్తారు. కొందరిని వారి భర్తలు, బంధువులు ఆపేసారు. అలా ఆపేయబడినవారు అయ్యో అని బాధపడలేదు. ఉన్నచోటే మఠం వేసుకుని కూర్చుండిపోయారు. కూర్చున్నచోటే కృష్ణుడి ధ్యానంలో మునిగిపోయారు.
ఇక్కడ గమనించవలసినది పరమాత్మ గోపికలకు ముక్తిని " ఇద్దామని " నిర్ణయించారు.
అలా అమ్మవారు నిర్ణయించుకోవాలి మనకు ఏమిద్దామన్నది. మనం కోరుకోవడం కాదు.
మేము 1993లో ఉత్తరభారతంలోని దేవాలయాలను చూడడానికి వెళ్ళాం. ఆగ్రాలో మకాం వేసి మథుర వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకున్నాం. కాశీ వెళ్ళడానికి ఆగ్రాలో రాత్రి రైలు ఎక్కాం. ఉదయం 5 గం.లకు ఏదో స్టేషన్ లో ఆగింది. కాఫీ దొరుకుతుందేమో అనుకుని క్రిందకు దిగి ఒకాయన్ని ఇది ఏ ఊరు అని అడిగాను. అతను అలహాబాద్ అన్నారు. త్రివేణీసంగమం ఊరా అన్నాను. అవునన్నారు అతను. లోపలికి వెళ్ళి మా సోదరీమణులతోనూ భార్యతోనూ విషయం చెప్పి దిగి స్నానం చేసి వెడదామా అంటే సరే అన్నారు అందరూ. దుప్పట్లు అవీ చుట్టేసి గబగబా ముందర క్రిందకు దిగిపోయాం 2 ని.లలో. అక్కడ ఎవరినో అడిగితే ఫలానా చోటుకి వెళ్ళి పడవ కట్టించుకుని లోపలికి సంగమం దగ్గరకు వెళ్ళి స్నానం చేయండి అన్నారు. చాలామంది ఒడ్డున స్నానం చేస్తున్నా మేము పడవమీద లోపలికి వెళ్ళి పవిత్రసంగమంలో స్నానం చేసి మురిసిపోయాం.
ఇదంతా ఎందుకంటే మనల్ని అనుగ్రహిద్దామని అమ్మవారు నిర్ణయించుకోవాలి. మహాకుంభ్ కి వెడదామని మనం అనుకుంటే సరిపోదు. అందుకని అయ్యో వెళ్ళలేకపోయామే అని ఎవరూ బాధపడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
" అనుకున్నామని జరగవు
అన్నీ, అనుకోలేదని ఆగవు
కొన్ని, జరిగేదంత మంచికని,
అనుకోవడమే మనిషి పని "
- మురళీకృష్ణ సినీమా.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏🙏
ReplyDelete👌
Deleteధన్యులు మీరు మేము కూడ 2010 లో ఒక బృందము గా పోయి ప్రయాగ లో కిరాయి పడవ లో లోపలికి పోయి మునక వేసి తీరమ న బ్రాహ్మణ మంత్రోచ్చారన తో దంపత పూజ చేసుకున్నాము తెల్లని గంగా జలము నల్లని యమునా నది అగుపించక దాగుడు మూతల సరస్వతి నది సంగమము లో స్నానము ఒక అద్భుతమైన అనుభూతి జీవితమే సఫలము
ReplyDeleteఅమ్మవారి అనుగ్రహం అలా ఉంటుంది. అవ్యాజకరుణామూర్తి
ReplyDeleteమీరు యదార్ధం చెప్పారు.అమ్మ దయ ఉంటే చాలు. స్మరణ మాత్రానే కరుణా కటాక్షం ప్రసాదిస్తూ కాపాడుతుంది అమ్మవారు శ్రీ మాత్రేనమః
ReplyDelete