దీపావళి శుభాకాంక్షలు అందరికీ, అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టే దీపశిఖ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అజ్ఞానధ్వాంతదీపికా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 993 వ నామం.

" అజ్ఞానధ్వాంతదీపికా " - అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టే దీపం వంటిది. దీపిక అంటే దీపశిఖ. 

అమ్మవారు జ్యోతిస్వరూపం. మన హృదయంలో ఉంటుంది.

" దైవీ హ్యేషా గుణమయీ 

  మమమాయా దురత్యయా" 

             - భ.గీత 7:14 

నామాయను తప్పించుకోవడం కష్టమన్నారు పరమాత్మ. ఆ మాయ కమ్మేయడం వల్ల హృదయంలోని దీపశిఖ కనబడదు.

1950/60 లలో ఇంట్లో చిన్నవి చిమ్నీ దీపాలు ఉండేవి. ఆ చిమ్నీ ని తెల్లటి ముగ్గుతో బాగా తుడిచేవారు. అప్పుడు చిన్న దీపమయినా గది అంతా వెలుగునిచ్చేది.

అలాగ ఎప్పుడూ శుభసంకల్పాలనే చేస్తూంటే మాయ తొలగి దీపశిఖ/అమ్మవారు జీవితంలో వెలుగును నింపుతుంది. సందేహం అక్కరలేదు.

" శివానుగ్రహదేవా ముముక్షుర్వై    

  శరణమహంప్రపద్యే " - " ఈశ్వరానుగ్రహం పొందాలంటే భక్తియే మార్గం " అని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. భక్తి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం పోతే అంతా సచ్చిదానందమే ( సత్ + చిత్ + ఆనందం ) కదా. 

" ఉద్దీప్యస్య జాతవేదో ఉపఘ్న నివృతిం మమ " - దీపం ఐశ్వర్యం, జ్ఞానం, ఆనందం కలిగిస్తుంది, బాధాకరమైన దోషాలను పోగొడుతుంది - అని చెబుతూంది వేదం.

శ్రీసూక్తంలో అమ్మవారిని ప్రార్ధిస్తూ " లోకైక దీపాంకురాం ( లోక+ఏక+దీప+అంకురాం ) అంటాం అంటే " లోకాలన్నింటికీ ఒకే ఒక్క దీపమై ఉన్నది " అని. దీపం అంటే జ్ఞానం. లక్ష్మీదేవి జ్ఞానప్రదాత. చీకటి పోవాలంటే దీపం కావాలి. అజ్ఞానాంధకారం పోవాలంటే దీపలక్ష్మి అనుగ్రహం కావాలి.

అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ