మమకారం తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మమతాహంత్రీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 165 వ నామం . 

" మమతాహంత్రీ " అంటే మమకారమును పోగొట్టునది అని అర్ధం. ఈ మమకారం అనేది చాలా భయంకరమైనది. బంధాలను పెంచుతూ నానా చెడ్డపనులూ చేయిస్తుంది.

కురుక్షేత్రయుద్ధం మొదలయే ముందు దుర్యోధనుడు తల్లి గాంధారి వద్దకు వెళ్ళి " అమ్మా విజయం నన్ను వరించేలా ఆశీర్వదించు " అని కోరుతాడు. గాంధారి " యతో ధర్మః తతో జయః " అని ఆశీర్వదించి వెళ్ళిరా నాయనా అంటుంది.

ఆవిడకు తెలుసు. దుర్యోధనుడు చేసిన పనులు అన్నీ అధర్మమే అని, అతనికి విజయం దక్కదని. ద్రౌపదిని ఏకవస్త్రగా ఉన్నప్పుడు సభలోకి లాక్కురమ్మనడం, కృష్ణపరమాత్మ అంతటివాడు సంధికోసం ప్రయత్నం చేసినప్పుడు కనీస గౌరవం ఇవ్వకపోవడం లాంటి విషయాలన్నీ ఆవిడకు ఎరుకే. కాని దేన్నీ అడ్డుకోలేకపోయింది. 

ఇన్ని విషయాలు తెలిసినా కుమారులందరూ యుద్ధంలో మరణించారు అని తెలిసినప్పుడు కృష్ణపరమాత్మని " దగ్గరుండి నా కుమారులను చంపించావు " అని తూలనాడుతుంది. పుత్రులమీద మమకారం అంత చెడ్డది. 

ఇటువంటి విపరీతమయిన మమకారాన్ని తగ్గిస్తుంది అమ్మవారు ఆవిడ పాదాలను ఆశ్రయిస్తే.

కుంతీదేవి పుత్రులు కష్టాలలో ఉన్నప్పుడు వారితో ఉంది. ధర్మరాజు చక్రవర్తి అయినప్పుడు మాత్రం గాంధారి, ధృతరాష్ట్రులతో వానప్రస్థానికి వెళ్ళిపోయింది. అటువంటి స్థితిని కలుగచేస్తారు అమ్మవారు తనను నమ్ముకున్న వారికి.

అందరం అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం, అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ