గురువు అమ్మవారి స్వరూపం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కులరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 897 వ నామం.

" కులరూపిణీ " అని కొలుస్తాం అమ్మవారిని. కులం అంటే " గురుపరంపర ". ఆవిడ గురుస్వరూపిణి. మంచి గురువుని పట్టుకుంటే మనకు మంచి ఆలోచనలు కలిగేలా చేసి మంచి పనులు చేసేలా తోడ్పడతారు. గురువు అంటే అమ్మవారి స్వరూపమే. 

తల్లిదండ్రులతో సమానంగా గురువును గౌరవించమంది సనాతనధర్మం. వీరు నిస్వార్థపరులు. భవిష్యత్తులో ఇతను ( సంతానం/శిష్యుడు ) వారికి ఉపయోగిస్తారనే భావన వీరికి ఉండదు.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" తద్విద్ధి ప్రణిపాతేన 

  పరిప్రశ్నేన సేవయా, 

  ఉపదేక్ష్యంతి తే జ్ఞానం 

  జ్ఞానినస్తత్త్వదర్శినః " 

            - భ.గీత 4:34

" మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని.

స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న మంచిదయి, గౌరవంగా ఉండాలి అని. 

" యదా యదాహి ధర్మస్య ......" అని పరమాత్మ భ.గీత ( 4:7 ) లో తెలియచేసినట్లు ధర్మం దారి తప్పుతూందని అనిపించినప్పుడల్లా ప్రత్యేకంగా ఓ గురువుని అనగా ఆదిశంకరులు, భాస్కరరాయులు, కంచిపరమాచార్యులు లాంటివారిని పంపిస్తూంటారు అమ్మవారు. 

" తన్మే మనః శివసంకల్పమస్తు " అని సంకల్పసూక్తం చెబుతూంది. అంటే " మా మనస్సులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలుగుగాక " అని ప్రార్థిస్తాం.

అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ