మంత్రం అంటే కఠినంగా పెద్దదిగా ఉండాలనేమీ లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మంత్రసారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 846 వ నామం.

" మంత్రసారా " అంటే మంత్రం యొక్క సారం. సారం అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం చెప్పారు.

" మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - మననం/జపం చేస్తే రక్షిస్తుంది కనుక మంత్రం. 

మంత్రం అంటే కష్టమయిన పదాలతో పెద్దగా ఉండాలని ఏమీలేదు. గురువు ఉపదేశించిన మంత్రం " అయ్యో ఇలా చిన్నగా సులభంగా ఉందేమిటి, పనిచేస్తుందా " అని అనుకోకూడదు. మన సమస్యను, శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మంత్రోపదేశం చేస్తారు గురువు.

ప్రతీ అక్షరానికీ ఓ దేవత ఉన్నారు. అక్షరాలన్నీ మంత్రాక్షరాలే. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ మాట ప్రకృతి/సమాజం మీద ప్రభావం చూపుతుంది.

రామనామం తారకమంత్రం. తరింపచేసే మంత్రం. త్యాగయ్య, రామదాసు వంటివారు రామనామజపం చేసుకుని తరించారు, చిరస్మరణీయులు అయారు. ఓం నమో నారాయణాయ మంత్రంతో ప్రహ్లాదుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో ధృవుడు భగవంతుని అనుగ్రహానికి పాత్రులయారు, చిరస్మరణీయులు అయారు. హనుమకు రామజపం తప్ప వేరే ధ్యాస లేదు.

కఠోపనిషత్తులో ఓ అద్భుత మంత్రం ఉంది:

" ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్య వరాన్నిబోధత " - " లే, జాగ్రత్తపడు, గమ్యం చేరేవరకూ ఆగకు " ఇది మంత్రం. ఇదే వివేకానందుడి నినాదం అయింది - " Arise! Awake! And stop not till the goal is reached ". ప్రపంచప్రజలను ఉర్రూతలూగించింది. లక్షలాది మంది ఆయన అభిమానులు, శిష్యులు అయారు.

దేనికయినా శ్రద్ధ, నమ్మకం ముఖ్యం. అవి ఉన్నవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నాస్తి సంశయం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ