ఋషులకు దర్శనం, మనకు నమ్మకం ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" శాస్త్రసారా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 845 వ నామం.

" శాస్త్రసారా " శాస్త్రము యొక్క సారం. " సారం " అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం.

శాస్త్రీయం అంటే వైజ్ఞానికం. శాస్త్రాలలో చెప్పిన విషయాలు అన్నీ వైజ్ఞానికమయినవి.

మూఢనమ్మకాలు అంటూంటారు. శాస్త్రం చెప్పినది నమ్మడంని శ్రద్ధ అంటారు. శాస్త్రం చెప్పినది నమ్మకపోవడం మూఢనమ్మకం. అటువంటి మూఢులు వారు ఏది నమ్మితే అదే నిజము/సరైనది అనుకుంటారు. 

నీటిలో సూక్ష్మజీవులు ఉన్నాయి. కనబడుతున్నాయా. లేదు. ఓ టెలిస్కోపు ఉన్నవాడు దానితో చూస్తే కనబడుతాయి. ఋషులకు, జ్ఞానులకు తపోశక్తి ఉంటుంది. దానితో వారు దేవతలను అంటే సూక్ష్మశరీరులను చూడగలరు. మనకు ఆ శక్తిలేదు, చూడలేకపోతున్నాం కనుక దేవతలు లేరు అని అనుకుంటే ఎలా. 

టెలిస్కోపు ఉన్నవాడు మీ రక్తంలో వైరస్ ఉంది, మందు వాడండి అంటే వాడుతున్నాం కదా. మరి ఋషులు, శాస్త్రాలు చెప్పినవి కూడా నమ్మాలి కదా. 

ఋషులకు దర్శనం, మనకు నమ్మకం ముఖ్యం.

శ్రీరాముడు ఎప్పుడూ ఇలా చేద్దాం అనలేదు. శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు కనుక ఇలా చేద్దాం అనేవారు. 

కృష్ణపరమాత్మ కూడా " నేను చెబుతున్నాను, ఇలా చెయ్యి "అనలేదు:

" తస్మాత్ శాస్త్రం ప్రమాణం 

  తే కార్యాకార్య వ్యవస్థితౌ,

  జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం 

  కర్మ కర్తుమిహార్హసి "

             - భ.గీత 16:24

" శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని.

మన సనాతనధర్మం విశిష్టత అది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. చాలా చక్కగా చెప్పారు,🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ