శ్రద్ధ అంటే శాస్త్రాలు చెప్పినట్లు నడుచుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" హేయోపాదేయవర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 304 వ నామం. 

" హేయోపాదేయవర్జితా " అంటే విడిచిపెట్టదగినది, గ్రహించదగినది అను రెండింటి చేతను విడువబడినది. ఎంత అద్భుతం. అమ్మవారికి గ్రహించవలసినది లేదు, విడిచిపెట్టవలసినది లేదు. మనకు ( జీవులకు ) కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి అంటూ ఉంటాయి.

శాస్త్రములు కొన్ని చేయమంటాయి, కొన్ని చేయవద్దంటాయి. శాస్త్రాలు అజ్ఞానులకు. అమ్మవారు జ్ఞాని.

శ్రీరాముడు ఎప్పుడూ ఇలా చేయి, అలా చేయకు అనలేదు. శాస్త్రాలు, ఋషులు ఇలా తెలియచేసారు, అలా చేద్దాం అనేవారు.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" తస్మాత్ శాస్త్రం ప్రమాణం 

  తే కార్యాకార్య వ్యవస్థితౌ,

  జ్ఞాత్వా శాస్త్రవిద్యానోక్తం 

  కర్మ కర్తుమిహార్హసి " 

             - భ.గీత 16:24

పరమాత్మ అన్నారు అర్జునుడితో " శాస్త్రాలు ఎలా చెబుతున్నాయో అలా చెయ్యి. ఏది చెయ్యమందో అది చెయ్యి, ఏది వద్దందో అది మానేయి " అని.

ఏదయినా కోరిక తీరాలంటే కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అమ్మవారికి కోరికలేమి ఉంటాయి. అమ్మవారు పొందిందీ లేదు, పొందబోయేదీ లేదు, పొందలేనిదీ లేదు. అందుకే అమ్మవారికి గ్రహించవలసినది లేదు, విడిచిపెట్టవలసినది లేదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. చాలా చక్కని హిత వాక్యములు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ