అమ్మవారు చూస్తారు, చూడబడుతారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" జ్ఞానజ్ఞేయస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 981 వ నామం.

" జ్ఞానజ్ఞేయస్వరూపిణీ " అంటే చూచునది చూడదగినది రెండును స్వరూపముగా గలది. జ్ఞానం అంటే దృక్కు, చూపు ( చూచునది ). జ్ఞేయం అంటే దృశ్యం ( చూడదగినది ).

ఈశావాస్యోపనిషత్తు " ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనము " అని తెలియచేస్తూంది.

మనకు ఏది కావలసినా అమ్మవారే ఇవ్వాలి. అందుకని అమ్మవారిని పూజిస్తాం, ప్రార్థిస్తాం. పూజింపదగినది/చూడదగినది అమ్మవారు. అమ్మవారు మనకు కావలసినవి ఇస్తారు, మనల్ని బాగుగా చూసుకుంటారు. చూచునది అమ్మవారు. రెండూ అమ్మవారే.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" అనన్యాశ్చింతయంతో మాం 

  యేజనాః పర్యుపాసతే, 

  తేషాం నిత్యాభియుక్తానాం 

  యోగక్షేమం వహామ్యహం " 

            - భ.గీత 9:22

" ఇతర ( అక్కర్లేని ) విషయాలగురించి ఆలోచనచెయ్యడం మానేసి నన్నే ధ్యానం చెయ్యి, నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను " అన్నారు పరమాత్మ. క్షేమం అంటే ఉన్నది కాపాడడం. యోగం అంటే లేనిది ఇవ్వడం. రెండూ అనుగ్రహిస్తారు నమ్మి సేవిస్తే.

మన దృష్టి కేవలం అమ్మవారి పాదాలమీదే ఉంటే అమ్మవారు తన దృష్టి మనమీద పెట్టి అన్నీ అనుగ్రహిస్తారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ