ఏదయినా పని అవనప్పుడు బాధ పడనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" విఘ్ననాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 451 వ నామం .

" విఘ్ననాశినీ " అంటే విఘ్నములు పోగొట్టునది అని అర్ధం.

అమ్మవారిని ప్రార్ధిస్తే విఘ్నాలన్నిటినీ నాశనం చేస్తారా?. చెయ్యరు. ముఖ్యమయిన పనులు మొదలు పెట్టినప్పుడు " ఏ విఘ్నాలు కలుగకుండా పని అయేలా చెయ్యి తల్లీ " అని ప్రార్ధించి మ్రొక్కుకుంటాం కూడా. కొన్ని పనులు అవుతాయి, కొన్ని అవవు. 

అవని పనుల గురించి ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే నమ్ముకున్న అమ్మవారి ఆలోచన వేరుగా ఉండవచ్చు. ఆ పని అయితే భవిష్యత్తులో ఏవయినా సమస్యలలో ఇరుక్కోవచ్చు. మన విషయంలోనే కాదు, మన బంధువుల, స్నేహితుల విషయంలో కూడా " అయ్యో ఆ పని ఆ రోజు అయివుంటే ఈరోజు చాలా బాధపడి ఉండేవారం " అని అనుకోవడం వింటూంటాం. మనం అన్ని పనులకూ శ్రద్ధగా భక్తితో అయేలా చూడమని కోరుకున్నా మనకు ఉపయోగపడే పనులనే అమ్మవారు అయేలా చూస్తారు.

అందుకే ఎప్పుడయినా ఓ పని అవకపోతే మరీ బాధపడిపోకూడదు. ఇంకో 2,3 సార్లు ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా అవకపోతే అమ్మవారికి ఇష్టం లేనట్లుంది అనుకుని వదిలేయాలి, ముందుకు సాగిపోవాలి. 

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" కర్మణ్యేవ అధికారస్తే 

  మా ఫలేషు కదాచన "

              - భ.గీత 2:47

" కర్మమీదే నీకు అధికారం, ఫలితం మీద కాదు " అన్నారు పరమాత్మ అర్జునుడితో. పని మనమే చేస్తాం కాని ఫలితం మన చేతులలో ఉండదు, చాలావాటి మీద ఆధారపడి ఉంటుంది. ఫలితం లభించినప్పుడు మన ప్రాప్తం అంతే అనుకోవాలి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ