నాదమే స్వరూపముగా గలది అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నాదరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 299 వ నామం .
" నాదరూపా " అంటే నాదమే స్వరూపముగా
గలది అని భాష్యం చెప్పారు.
" శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః " - అంటే చిన్నపిల్లలు, పశువులు, పాములు కూడా గానరసాన్ని ఆనందిస్తాయి అని తెలియచేస్తున్నాయి మన శాస్త్రాలు. తను ఇష్టపడే గానానికి అంతటి శక్తినిచ్చింది అమ్మవారు.
కృష్ణుడి వేణుగానాన్ని గోవులే కాదు ఇతర జంతువులు వృక్షాలు కూడా విని మైమరచిపోయేవిట బృందావనంలో.
1984 లో చుక్చీ సముద్రంలో 2000 బెలుగా తిమింగిలాలు మంచులో చిక్కుకుపోయాయి. మంచు 12 అడుగుల మందంగా పేరుకుపోయింది. రష్యా మోస్క్వా అనే పేరుగల మంచును బ్రద్దలు కొట్టే ఓడను పంపింది. మంచును బ్రద్దలు కొట్టినా తిమింగిలాలు బయటకు రాలేదు, రావడానికి ఇష్టపడుటలేదు అని గ్రహించారు. అప్పుడు ఓడలోని సిబ్బంది చక్కటి శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం, తిమింగలాలు ఓడవైపుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సంగీతాన్ని కొనసాగిస్తూ ఓడను మెల్లిగా ఎదరకు పోనిస్తూ తిమింగలాలను అన్నింటినీ సముద్రానికి చేర్చడం జరిగింది. ఇది ఒక అద్భుత ప్రక్రియ అని ప్రపంచమంతా కొనియాడింది. ఈ ప్రక్రియ 6 నెలలు కొనసాగింది.
అదీ మన సనాతనధర్మం, ఋషుల విద్వత్తు విశిష్టత. మన వాజ్మయానికి సాటిలేదు, రాబోదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment