అమ్మవారిని ధ్యానం చేద్దామని అనుకోవడమే ముక్తికి తొలిమెట్టు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దురాచారశమనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 194 వ నామం .

" దురాచారశమనీ " అంటే చెడునడవడికను పోగొట్టునది అని భాష్యం చెప్పారు. ఎప్పుడు పోగొడుతారు. తప్పులు చేసాను, క్షమించు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని అమ్మవారిని వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తారు. ధర్మమార్గంలో నడిచేలా ఏర్పాటు చేస్తారు.

నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అని గరుడపురాణంలో విస్తృతంగా చెప్పబడింది. ఎన్నో ప్రాయశ్చిత్తాలు తెలియచేసారు.

" తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ 

  యతేత మృత్యో రవిపధ్యరాత్మనా "

ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి. రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" అపి చేత్ సుదురాచారో     

  భజతే మామనన్యభాక్,

  సాధురేవ స మంతవ్యః  

  సమ్యగ్వ్యవసితో  హి సః "

             - భ.గీత 9:30

" మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన, యధార్ధముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో  సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు " అని.

దీని అర్ధం ఒకసారి భగవంతుని వైపు మనస్సు మళ్ళిందంటే తరించే సమయం ఆసన్నమైనట్లే అని. అలా మళ్ళడమే ఒక వరం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ