శ్రీశృంగేరీ శారదాపీఠం 33వ పూర్వ పీఠాధిపతుల జయంతి నేడు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

శ్రీశృంగేరీ శారదా పీఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి ( 33 వ పీఠాధిపతి 1879 - 1912 ) వారి జయంతి నేడు. శుభాకాంక్షలు.

ఆదిశంకరులు కర్మకాండ కన్నా జ్ఞానకాండే తరించడానికి సామాన్యులకు కూడా ఉపయోగమని భావించి కుమరిల్ భట్టు గారి శిష్యులు అయిన మందనమిశ్ర, ఆయన భార్య ఉదయభారతిలతో వాదన చేసి, ఒప్పించి, మెప్పించి, ఓడించారు. పందెం నియమానుసారం మందనమిశ్ర శంకరుల శిష్యుడయారు. 

శ్రీశృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి దానికి మొదటి పీఠాధిపతిగా మందనమిశ్రాను " సురేశ్వరాచార్య " గా నామకరణం చేసి నియమించారు. 

అప్పటినుండి సనాతనధర్మ పరిరక్షణకోసం అమ్మవారి ఆశీస్సులతో ఈ గురుపరంపర అద్భుతంగా కొనసాగుతూంది. 

యజుర్వేదం/అధర్వణవేదాల్లో అధికసంపద కోసం చేసే యాగం ఉంది. కోరికలు తప్పుకాదు. వివిధరకాలైన కోరికలు తీర్చుకోవడానికి వీలుగా చాలా కార్యక్రమాలు తెలియచేసాయి మన వేదాలు/శాస్త్రాలు. ఈ యాగంలో చివరన " సంపదను చేతిలో ఉంచు " అని కోరడం ఉందిట. " ఎవరి చేతిలో ఉంచాలి, ఎందుకు నా చేతిలో ఉంచు అని అనలేదు " అనే సందేహం వచ్చిందిట పండితులకు. " పాహిమాం - నన్ను రక్షించు, దేహిమాం - నాకు ప్రసాదించు " అని ప్రార్ధిస్తాం అమ్మవారిని కదా, ఆ మంత్రం లో అలా స్ఫష్టంగా ఎందుకు లేదు అన్నది సందేహం.

శృంగేరీపీఠం 12వ పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్యస్వాముల వారు ఈ సందేహాన్ని తీర్చారు. ఏమని అంటే " నీ " అని తీసుకోవాలి అందుకే " నా " అని చేర్చలేదు అని. అదేమిటండీ యాగం చేసినాయన సంపదని దేవుడు చేతిలో ఉంచమనడం ఏమిటి అంటే స్వామి అన్నది " నీ చెయ్యి, దోసిలి ఎంత ఉంటుంది, 100 కాసులు కూడా పట్టవు " అదే పరమాత్మ అయితే " సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్....... " - సహస్ర అంటే వెయ్యి కాదు అనేకం అని - పరమాత్మ అనేకమయిన చేతుల్లో నీ సంపదను ఉంచేస్తే ఎప్పుడు అవసరమయితే అప్పుడు ఇస్తూంటారు మనకు అని. 

ఎంతటి మేధోసంపత్తి,అద్భుత భావన, సందేహ నివృత్తి. ఈయనే " వేదాంత పంచదశి " అనే గ్రంథాన్ని రచించారు.

ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీవిధుశేఖర భారతీ స్వామి వారు మే 2022లో శ్రీశంకరజయంతి సందర్భంగా అనుగ్రహభాషణం చేస్తూ " నేను ఆస్తికులకి ( నాస్తికులకు కాదు ) చెప్పేదేమిటంటే - వేదాలను గౌరవించండి, మంచిమార్గంలో నడవండి, ఎవరికీ అపకారం చెయ్యకండి, వేదాలలో ఏమయినా సంశయాలు ఉంటే నివృత్తి చెయ్యడానికి మా పీఠం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, అందరికీ శుభాశీస్సులు " అని ముగించారు.

శారదా స్వరూపులు.

ఏతత్ సర్వం శ్రీశారదాదేవ్యార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ