అమ్మవారికి కొంచెం గర్వం ఎక్కువే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః"🙏

" గర్వితా " - అమ్మవారి అద్భుతనామం. ఇవది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 856 వ నామం.

" గర్వితా " అంటే గర్వము కలిగినది. అమ్మవారికి కొద్దిగా గర్వం అంటారు.

తరచుగా వింటూంటాం " ఏమి చూసుకునో అంత గర్వం " అని. అంటే " ఏమయినా " గొప్పదనముంటే గర్వపడచ్చు అనేగా. మరి సృష్టినంతా ఇంత లయబద్ధంగా దోషరహితంగా నడిపిస్తూందంటే ఆవిడ ఎంత గర్వపడాలి. నిజానికి గర్వపడే హక్కు అమ్మవారికి ఒక్కరికే ఉంది. 84 లక్షల జీవరాసులకీ ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూందంటే ఎంత కష్టపడుతూ ఉండాలి. అమ్మవారి సృష్టి అద్భుతాన్ని తెలుసుకోవాలంటే ఎక్కువ కష్టపడక్కరలేదు. నాలుగు పువ్వులని చూస్తే చాలు - వాటి రంగులు, రేకులు, సువాసనలు వేటికవే సాటి. పువ్వులలోని మకరందం ఇంకో అద్భుతం. మరి అంత అద్భుతమైన తన సృష్టి అందాన్ని చూసుకుని అమ్మవారు గర్వపడడంలో ఆశ్చర్యమేముంది.

జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఎన్ని వింతలు, మాయలు చేస్తారు అమ్మవారు. ఒకటి చూసి కావాలనుకుని కష్టపడి దాన్ని సంపాదిస్తాడు. మరుసటి రోజే దీనికోసమా ఇంత కష్టపడ్డాను అని నవ్వుకుంటాడు/బాధపడతాడు. సమస్య వస్తే తల్లడిల్లి పోతాడు. సమస్య తీరిపోగానే ఎంత హాయిగా ఉంది అని ఆనందపడిపోతాడు.

మనం అనుకున్న పని అయితే ఆనందమే. అవకపోతే బాధపడకూడదు. అమ్మవారు ఆ పని అవకుండా చేసారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. భవిష్యత్తులో మనం బాధపడవలసి రావచ్చు ఆ పని అయి ఉంటే.

జీవితాలను ఉగాది పచ్చడిలా చేసి వింత చూస్తూంటారు అమ్మవారు.

అమ్మవారి అద్భుత కార్యక్రమాలకి మనం కూడా గర్వపడదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ