హనుమజ్జయంతి ఎప్పుడు చేసుకోవాలి?- చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

హనుమజ్జయంతి ఎప్పుడు?

పూజ్యులు సామవేదంవారు తెలియచేసినది హనుమ చైత్ర శుద్ధ పౌర్ణమినాడే జన్మించారు అని. అందరికీ తెలిసిన విషయాలు పుట్టగానే హనుమ సూర్యుడిని పండు అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఎగరడం, ఇంద్రుడు హనుమని మరో రాహువులాంటివాడు అనుకుని వజ్రాయుధంతో కొట్టడం, హనుమ స్పృహ కోల్పోవడం, వాయుదేవుడి కోపం తగ్గించడానికి బ్రహ్మ మొ.గు వారు హనుమకు వరాలు ఇవ్వడం. ఇదంతా అక్కడ వెంటవెంటనే జరిగిపోయినా కాలం తేడావలన మనకు 40 రోజులుగా తెలుస్తూందని ఆయన తెలియచేసారు. హనుమ తిరిగి తేరుకున్న రోజు వైశాఖ బహుళ దశమి అని.

భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఒక్కో తిథినాడు హనుమజ్జయంతి చేసుకోవడం చూస్తూంటాం.

" జయం మంగళంచ దదాతి ఇతి జయంతి ".

హనుమ జయాన్ని, మంగళాన్ని కలుగచేస్తారు భక్తులకు. హనుమది అద్భుత వ్యక్తిత్వం. కనుక రోజూ జయంతి చేసుకుని ఆయనను గౌరవించుకున్నా తక్కువే.

రెండు రోజులూ స్వామి జయంతి చేసుకుని ఆయనను పూజించుకుని ఆయన అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీహనుమదార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ