రమణమహర్షి జయంతి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏

ఈరోజు పూజ్యులు రమణమహర్షి జయంతి.

జ్ఞానప్రదాత. ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడానికి అవతరించిన మహానుభావుడు.

శరీరం మీద ధ్యాసలేదు, లౌకికవిషయాలపై ఆసక్తిలేదు. " బ్రహ్మసత్యం, జగన్మిధ్య " అని సంపూర్ణంగా నమ్మిన జీవన్ముక్తులు. ఒకరిపై ద్వేషం/కోపం లేదు. అసలు ఎవరిపైనా ఇష్టం/అభిమానమే లేదు.

దేశంలోనే కాదు విదేశాలలోనూ ఎందరో శిష్యులు. ఈయన సందేశాలతో తరించినవారు ఎందరో.

రమణమహర్షి " అరుణాచల పరమాత్మన్ అరుణోభవ, చిత్తకంజ సువికాశాయ " అని ప్రార్ధన చేసేవారు. " మా మనస్సు మొగ్గలా ముడుచుకుపోయింది. నీ కరుణ అనే అరుణకిరణాలను ప్రసరించి అది విచ్చుకునేలా చెయ్యి తండ్రీ ( సూర్యకిరణాలు సోకితే పద్మం వికసిస్తుంది ) " అని ప్రార్ధిస్తారు. కారణజన్ములు. చిత్తకుంజ అంటే హృదయపద్మం.

" నహి భవతి యన్న భావ్యం,

  భవతిహిభావ్యం వినాపి  

  యత్నేన, కరతలగతిమపి  

  నశ్యతి, యస్యహి భవితవ్యతా నాస్తి "

జరగరానిది ఎంతప్రయత్నించినా జరగదు, జరిగేది నీ ప్రయత్నం లేకపోయినా జరిగి తీరుతుంది. పూజ్యులు రమణమహర్షి ఇదే తరచుగా చెబుతూండేవారు.

" కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన - కర్మమీదే నీకు అధికారం, కర్మఫలంమీద కాదు " అన్నారు పరమాత్మ గీతలో.

మొదట్లో మహర్షి బట్ట ఏమీ కట్టుకునేవారు కాదుట. ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్నాయన కనుక. దగ్గరగా ఉండే ఒకాయన " మీకు తేడా ఏమీ లేకపోవచ్చు కాని మీ దర్శనానికి వచ్చేవారికి ముఖ్యంగా స్త్రీలకి ఇబ్బందికరంగా ఉంటూంది " అని చెప్పడంతో అప్పటినుంచీ ఓ కౌపీనం ( గోచి ) పెట్టుకోవడం మొదలెట్టారుట.

ఓ సారి దగ్గరగా మసిలే ఒకాయన " ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే ఎలాగండి. కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్ అవీ వెళ్ళివస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది " అంటే ఈయన " నాకూ వెళ్ళాలనే ఉంది, ఎక్కడైనా వేదం చెప్పిన పంచభూతాలు ( భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ) కాక 6వది కనిపిస్తే చెప్పు, వెళ్ళి చూసివస్తాను " అన్నారుట. 

ఎప్పుడూ మౌనంగా ధ్యానంలో అలా కూర్చుని ఊండేవారుట. అటువంటి వారి దర్శనంతోనే అజ్ఞానాంధకారం తొలగుతుంది.

మేధా దక్షిణామూర్తి చిరునవ్వు చూడగానే సనకసనందనాదులకు జ్ఞానోదయం అయిపోయిందిట. 

కనబడేదంతా మాయ అని తెలుసున్నవారికి అంతా సత్+చిత్+ఆనందమే కదా.

కారణజన్ములు.

ఏతత్ సర్వం శ్రీఅరుణాచలశివార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ