భయయోగి మారీచుడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" రామభూతమిదం సర్వం
అరణ్యం ప్రతిభాతి మే,
రామమేవ హి పశ్యామి
రహితే రాక్షసాధిప "
" ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడయ్యా. రాముడు తప్ప వేరేమీ కనబడుటలేదు " - ఈ మాటలు అన్నది మారీచుడు అనే రాక్షసుడు, రావణుడితో.
" అంతా రామమయం
జగమంతా రామమయం " అంటే ఇదే.
మారీచుడు అంటాడు రావణుడితో " రాముడు కొట్టిన దెబ్బకు నేను మాంసం తినడం మానేసాను. ఇతరులను హింసించడం మానేసాను. ఋషుల వలే ఈ ఆశ్రమం కట్టుకుని " రామజపం " చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వేరే ఏ జపాలు తెలియవు కనుక. " ర " తో మొదలయ్యే ఏ పదాన్ని విన్నా రెండవ అక్షరం " మ " గానే వినిపిస్తూంది నాకు " అని.
ఏ వృక్షం చూసినా దాని వెనుక కోదండం ఎక్కుపెట్టిన రాముడు కనిపిస్తున్నాడు. పడుకున్నా కలలో కూడా రాముడే కనిపిస్తున్నాడు.
మారీచుడు భయయోగి. భాగవతంలో " భయంతో కాని కోపంతో కాని ప్రేమతో కాని ఏ విధంగా నన్ను తలుచుకున్నా అనుగ్రహిస్తాను " అన్నారు పరమాత్మ.
రావణుడు ప్రభువు, అతనికి ఆగ్రహం కలుగుతుంది అని తెలిసినా ఇంత కఠినమైన నిజాలు మారీచుడు ఎలా మాట్లాడగలిగాడు అంటే ఇప్పుడు మారీచుడికి నిజమైన ప్రభువు/గురువు శ్రీరాముడు కనుక. అతను ఆ స్థితికి చేరిపోయాడు.
మారీచుడు బంగారు లేడిగా మారడానికి వెళ్ళే ముందే తన ఆశ్రమాన్ని అగ్నికి ఆహుతి చేసేస్తాడు, ఇక తిరిగి రానని, రాముడిలో చేరిపోతానని తెలుసుకనుక. యోగి.
" అందాల రాముడు
అందువలన దేముడు "
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Sir,Your interpretation of Maareecha and Ravana's discourse is very brilliant Y
ReplyDelete(before plotting Seetha abduction with మారీచ's connivance) You have provided a great insight as well as interpretation of the Raaksha transformed mindset and his transformation from తామస అసుర to సాత్విక భక్త although by Fear thanks Guruji🙏👌👍
S Venu Gopala Reddy
ReplyDeleteGoddess bless you all
ReplyDelete