దేశంకోసం ప్రాణాలు అర్పించేవారు రుద్రాంశ సంభూతులు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

భారత్ శాంతిని, సౌఖ్యాన్ని, అందరి క్షేమాన్ని కోరుకునే దేశం. అలా అని ప్రస్తుతం మాత్రం " ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు " లాంటి చచ్చు సలహాలు ఇవ్వదు.

ఇంతకాలం ఒకవేపే చూసింది ప్రపంచం, ఇకపై రెండో వైపు చూస్తుంది.

పాకిస్తాన్ వి కోతి చేష్టలు. ఇంతకాలం సాగాయి దాని ఆటలు. ఇప్పుడు కల్లు తాగింది, ముల్లు గుచ్చుకున్నట్లుంది. రెచ్చి పోతూంది. 

" పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటి సమీపంలో భారీ పేలుడు. అజ్ఞాతంలోకి ప్రధానమంత్రి. బంకరులో దాక్కొన్నట్లు వార్తలు " అనే వార్త అబ్బుర పరచలేదు. అక్కడి ప్రజలే తిరగబడుతారు వారిమీద 4 రోజులు పోతే.

రెండూ అణ్వాయుధ దేశాలు అంటూ సన్నాయి నొక్కులు కొందరు. భారత్ కి అణ్వాయుధం వేసే ఆలోచనా ఉండదు, అవసరమూ లేదు. పాకిస్తాన్ అణ్వాయుధం వేస్తే ఏమవుతుంది. 5/10 శాతం భారత్ దెబ్బ తింటుంది. అప్పుడు మనం చూస్తూ ఊరుకోముగా, మనమూ వేస్తాం. అప్పుడు పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉంటుందా. 

గరికిపాటి వారు తరచూ అంటూంటారు " ధైర్యం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒకడి పిరికితనమే ఇంకొకడి ధైర్యం " అని. ఇంతకాలం ఇలాగే దేశం లోపల బయట కొందరు కుప్పిగంతులు వేసారు. భయపెట్టారు, మన సహనాన్ని పరీక్షించారు.

శంకరులు, వివేకానందుడు లాంటి వారు దేశానికి, సనాతనధర్మానికి చేయవలసిన సేవ చేసి 30 ఏళ్ళకే పరమపదించారు, చిరస్మరణీయులు అయారు.

చస్తూ బ్రతకడం కన్నా భావితరాల కోసం చచ్చి అలా బ్రతకడం నయం కదా.

" ప్రాణాంస్త్యక్తుం సదోద్యుక్తాః,

  దేశరక్షణ తత్పరాః, 

  రుద్రస్యాంశౌ హి యోద్ధారః, 

  పూజ్యా రుద్రవదేవ తే " 

            - చాణుక్యుడు 

" దేశరక్షణ కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడే వారు అందరూ రుద్రాంశ సంభూతులు. రుద్రుడు కి ఇచ్చే గౌరవాన్నే అలాంటివారందరికీ ఇవ్వాలి " అని భావం.

సరిహద్దులలో దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడుతూన్న వీరులను చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.

హమారా భారత్, సనాతనధర్మ మహాన్

సర్వే జనాః సుఖినోభవంతు - సూర్య.

శుభం భూయాత్ 

భారత్ - " ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను " - పోకిరీ సినీమా

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ