అతి మంచితనం చేతకాని తనంలా అనిపిస్తుంది, మంచిది కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అహింసా పరమో ధర్మః ,
ధర్మ హింసా తథైవచ "
అహింసే అత్యుత్తమమయిన ధర్మం అయినా ధర్మాన్ని నిలపడంకోసం చేసే హింస కూడా అహింసే అని చెబుతున్నారు.
ఇది వేదాల్లోనూ, ఇతరాల్లోనూ లేకపోయినా పరమాత్మ స్వయంగా చెప్పారు కదా:
" పరిత్రాణాయ సాధూనాం,
వినాశాయచ దుష్కృతాం "
సరిహద్దుల్లో సైనికులు చేసేది హింస అనరాదు.
చరిత్రలో జరిగిన ఓ అద్భుత సంఘటన చూద్దాం.
733 వ సం.లోనే మహమ్మదీయులు దండయాత్రకు వచ్చి కనౌజ్ రాజ్యాన్ని ముట్టడించారు. చీకటి పడడంతో రాజ్యం బయట విశ్రాంతి తీసుకుంటున్నారు. తెల్లవారగానే రాజ్యం మీద పడదామని.
వారి అభిప్రాయం ఏమిటంటే హిందూరాజులు " అహింసా పరమో ధర్మః " ని అనుసరిస్తారు కనుక ధర్మయుద్ధమే చేస్తారు, రాత్రి దాడిచెయ్యరు అని. ఎంత నమ్మకం. అందుకని హాయిగా తిని నిద్రపోయారు.
కనౌజ్ రాజు నాగభట(1), సేనాని తక్షకుడు. శత్రువుల సైన్యం అధికంగానే ఉంది అని చారులు తెచ్చిన వార్త కలవరపాటును కలిగించింది. ఓటమి ఖాయం, ఏమి చెయ్యాలి.
సేనాని తక్షకుడు రాత్రి ఒంటిగంటకు సైన్యంతో చప్పుడుకాకుండా వెళ్ళి పడుకున్న శత్రువుల తలలు నరకడం మొదలెట్టారు. అలజడికి లేచి పారిపోతూన్న మిగతావారిని రాజు తరిమి తరిమి చంపేసారు.
ఆ దెబ్బకు మళ్ళీ 300 సం.ల వరకూ ముస్లిములు హిందూదేశంవైపు చూడ్డానికి ధైర్యం చెయ్యలేదు.
మరి తరువాత ఏమయింది. ఘోరీ వచ్చాడు. అతన్ని పృధ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు క్షమించి వదిలేసాడు. ఓడిపోయినవాడిని చంపడం ధర్మం కాదని. పృధ్వీరాజ్ కూడా కనౌజ్ రాజులా ఆలోచించి ఉంటే దేశపరిస్థితి వేరేగా ఉండి ఉండేది అని ఎవరికయినా అనిపిస్తే నేరం అతనిది కాదు.
పృధ్వీరాజ్ వయస్సు చనిపోయేసమయానికి 26. అంత చిన్నకుర్రాడు " శతృవుని కూడా క్షమించాలి ( ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలి ) " అనే ధర్మానికి కట్టుబడడంవలన జాతిమొత్తం శతాబ్దాలబాటు శృంఖలాలతో బాధపడింది. అందుకే " ధర్మ హింసా తథైవచ " అన్నారు. తప్పుకాదు అనిపిస్తుంది.
" గతజల సేతుబంధనం కిం " అంటారు కాని మళ్ళీ అటువంటి పరిస్థితే వస్తే. చరిత్రను చూసి జాగ్రత్తపడాలి.
అందుకే మనకు నాగభటరాజు గురించి తెలియకుండా పృధ్వీరాజు గురించే నూరిపోసారు, జాగ్రత్తపడిపొతారనేమో.
" అతి సర్వత్ర వర్జయేత్ " అన్నారు. మంచితనం కూడా మరీ ఎక్కువ పనికిరాదు. చేతకానితనం అనుకునే అవకాశం ఉంది.
దేశం, సనాతనధర్మం రక్షణకోసం ఇకనైనా జాగ్రత్త పడాలి. శతృశేషం మిగల్చకూడదు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment