ధర్మ ఏవ హతో హంతి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" మూలం హి విష్ణుర్దేవానాం
యత్ర ధర్మః సనాతనః,
తస్య చ బ్రహ్మగోవిప్రాస్తపో
యజ్ఞాః సదక్షిణాః "
- భాగవతం 10:04:39
" తస్మాత్సర్వాత్మనా రాజన్
బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః .
తపస్వినో యజ్ఞశీలాన్
గాశ్చ హన్మో హవిర్దుఘాః "
- భాగవతం 10:04:40
మహాభాగవతంలోని అద్భుత శ్లోకాలు ఇవి. కనీసం వేల సంవత్సరాల క్రితం వ్రాసినవి అయినా నేటికీ ఇందులో తెలియచేసినదే జరుగుతూంది.
తనను చంపే కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో తెలియదు కంసుడికి. అందుకని రాక్షసులని అన్ని దిక్కులకూ పంపుతూ కంసుడు " వేదము, ఆవు, బ్రాహ్మణుడు, తపస్సు, యజ్ఞము ఎక్కడ ఉంటారో అక్కడ సనాతనధర్మం వెల్లివిరిస్తూ ఉంటుంది. అక్కడ విష్ణువు ఉంటాడు. ఇవన్నీ విష్ణువు శరీరభాగాలే, విష్ణువే సనాతనధర్మం. విష్ణువుని దెబ్బ కొట్టాలంటే సనాతనధర్మంని నశింపచేయాలి. అంటే వేదాలని, ఆవులను బ్రాహ్మణులను, తపస్సును, యజ్ఞాలని లేకుండా చేయాలి. వెళ్ళి ప్రతీచోటా వీటిని నశింపచేయండి " అని ఆదేశిస్తాడు.
ఈనాడు కూడా సనాతనధర్మంని గొయ్యితీసి ప్రాతిపెట్టాలి, తగలబెట్టాలి అనే వారందరూ చేస్తూన్నది ఇదే. వేదాలవల్లే సమాజంలో అశాంతి అని, బ్రాహ్మణులవల్లే కులవ్యవస్థ వచ్చింది, సమాజం భ్రష్టుపట్టింది అని ప్రచారం చేస్తున్నారు. గోవులను చంపడం, హింసించడం చేస్తున్నారు. యజ్ఞాలు అశాస్త్రీయం అని ప్రచారం చేస్తున్నారు.
దీనిలో ఓ అద్భుత మర్మం/రహస్యం ఉంది. కంసుడు ఆవులను, బ్రాహ్మణులను హింసించడం ద్వారా సనాతనధర్మంని నశింపచేద్దామనుకున్నది అతనికి మరణించే కాలం దగ్గరయినప్పుడు. అంటే పోయేకాలం ఆసన్నమయినప్పుడే, ఆసన్నమయినవారికే సనాతనధర్మాన్ని మట్టుపెట్టాలని, ఆవులను హింసించాలనే ఆలోచన వస్తుంది అని తెలుస్తూంది.
సనాతనధర్మానికి ఏమీ హాని ఉండదు కాని దానిని కించపరిచేవారికి మాత్రం పోయేకాలం దగ్గరకొచ్చిందని, మరణం ఆసన్నమయిందని తెలుస్తూంది.
" యదా యదా హి ధర్మస్య
.......తదాత్మానం సృజామ్యహం "
- ( భ.గీత 4:7 )
పరమాత్మ రావడమో, ఎవరినో పంపించడమో జరగడం ఖాయం. అటువంటి వారిని శిక్షించడమూ తప్పదు. సంశయం నాస్తి.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
( నిన్న ప్రపంచ బ్రాహ్మణుల దినోత్సవం అని చదివినప్పుడు ఇది జ్ఞాపకానికి వచ్చింది. శుభం )
Comments
Post a Comment