ఆకాశాన్నించే అన్నీ వస్తాయి, దానిని ( ఓజోన్ ) కాపాడుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః "🙏

" ఓజోవతి " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 767వ నామం.

ఓజస్సు ని కలిగి ఉన్నది, ప్రసాదించేది అని అర్ధం. దీనిని భగవత్ శక్తిగా చెబుతారు.

శరీరం సప్తధాతువులతో అనగా " రసం, రక్తం, మాంసం, మజ్జ, ఎముక, మేధస్సు, శుక్రము " లతో కూడినది అంటారు. సప్తధాతువుల ప్రస్థావన శ్రీశంకరుల " నిర్వాణషట్కం " లో కూడా ఉంది.

ఇంకో 2 సూక్ష్మధాతువులు ఉన్నాయి. అవి " ప్రాణము, జీవము ". ఈ ప్రాణము జీవము కలిసి " ఓజస్సు " అని పిలవబడుతూంది. ఏ జీవికైనా ప్రాణం తో బాటు జీవం కూడా ఉండాలి. అందుకే ఎవరైనా డల్ గా ఉంటే మనిషిలో జీవం లేదు ( ప్రాణం ఉన్నా ) అంటూంటారు. 

" కాశం " అంటే వెలుగు, ఆకాశం అంటే సంపూర్ణమైన వెలుగు. అంతేకాని అందరూ ఇప్పుడు అనుకుంటూన్నట్లు " శూన్యం " కాదు. " ఖం " అంటే ఆకాశం. మనం " సు " కలుపుకుంటే సుఖం, " దుః " కలుపుకుంటే దుఃఖం. ఆకాశానికి ( అమ్మవారికి ) ఏమీ సంబంధం లేదు. ఏది కలుపుకోవాలో తెలియని దోషం జీవులలోనే ఉంది.

" ఆకాశాత్ వాయుః అన్నాత్ పురుషః " అని తెలియచేసాయి ఉపనిషత్తులు. జీవుల మూలమే ఆకాశం అయినప్పుడు తనకి విలువనిచ్చి గౌరవించాలి కదా. ఆకాశం అమ్మవారి రూపం. అంటే జీవులకి ప్రాణం, జీవం ఆకాశాన్నించి వస్తాయి. అదే ఓజస్సు. 

దానినే " ఓజోన్ " అని ముద్దుగా పిలుస్తున్నారు ఇప్పుడు. ( మన " మిధ్య " ని వారు " మిత్ " అని పిలుచుకుంటూన్నట్లు ). 

ఇప్పుడు " అమెరికా, కెనడా " వాళ్ళకి ఓజోన్ విలువ బాగా తెలిసివస్తూంది, వేడిమిని భరించలేక. అంటార్కిటాలో ఇంకొంతకాలం మిగులుతుందిలే అనుకున్న మంచుకూడా కరగడం మొదలయ్యిందని తెలుస్తూంది. కల్పాంతానికి అంటే మనం అనుకునే జలప్రళయానికి " బీజం " పడిందని అనుకోవచ్చు.

అందుకే ప్రపంచశాంతిని కోరుకునృ మన పూర్వీకులు 3 పూట్లా చేసే సంధ్యావందనంలో గాయత్రీమాతను ఆవాహనచేస్తూ " ఓజోసి సహోసి బలమపి భ్రాజోసి...." అని ప్రార్ధనచేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. ఓజస్సు అంటే బలం. సహస్సు అంటే భరించటం. తన బలంతో ఈ విశ్వాన్నంతటినీ భరిస్తున్నారు. ఇలా విశ్వాన్నంతా లయబద్ధంగా ఉంచాలంటే ఎంత శక్తిమంతురాలు అయి ఉండాలి. 

" ధర్మ ఏవ హతో హంతి " - అంటే " ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది " అని అర్ధం.

అమ్మవారి ఒకనామం " ప్రచండ ( మహాకోపం )". ఆవిడ ఆ రూపంలో రాకుండా ఉండాలంటే అందరూ ధర్మాన్ని ఆచరిస్తూ తద్వారా తమ ఓజస్సును/ఆకాశాన్ని ( ఓజోన్ పొరను ) రక్షించుకుంటారని ఆశిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ