అమ్మవారికి అమితమైన ప్రేమ పిల్లలంటే - చీమలపాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏

" ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 658 వ నామం.

" ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ " అంటే చేద్దామనే సంకల్పం/కోరిక, ఎలా చేయాలనే జ్ఞానం, చేయడానికి ప్రయత్నం/పని చేయడం - ఇది కర్మ. ఇది మనుషులకే కాదు దేవతలకయినా ఆఖరికి అమ్మవారి కయినా అవసరమే. 

కృష్ణుడు గోపికలకు ముక్తిని ఇద్దామని నిర్ణయించారు. ఇది ఇచ్ఛ/కోరిక. ఏ రకంగా ఇవ్వాలి అంటే రాసలీల ద్వారా. ఇది జ్ఞానం. రాసలీల చేయడం క్రియ.

అమ్మవారు సృష్టి చేద్దామనుకుంటే ఏమిటి చేద్దామన్నది సంకల్పం, ఎలా చేయాలన్నది జ్ఞానం, చేయడానికి పని మొదలుపెట్టడం క్రియ.

అమ్మ మనకోసం వంట చేయడం మొదలుపెడుతుంది. వంట చేయాలి అనేది కోరిక - ఇచ్ఛాశక్తి. వంటకు కావలసిన సరకులు ఉంటేనే కదా వంట. ఈ సరకులు సంపద/లక్ష్మి. ఎలా చేయడం అన్నది జ్ఞానం - సరస్వతి. వంటచేయడం క్రియ, శక్తి - పార్వతి. ఇవి ఉంటే సరిపోతుందా, ముఖ్యంగా కావలసినది పిల్లలపై ప్రేమ, ఏదో ఒకటి చేసి తినిపించాలని. ఆ ప్రేమ‌స్వరూపిణియే రాధాదేవి. ప్రతీ అమ్మలోనూ ఈ నలుగురూ స్ధితులై ఉంటారు.

అందుకే మాతృదేవోభవ అనమన్నారు ప్రధమంగా. తల్లిది అవ్యాజప్రేమ. అమ్మ ప్రేమకు షరతులు ఉండవు.

ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం గానం చేస్తూ " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి " అన్నారు. చెడ్డ కొడుకు ఉంటాడేమో కాని ఎక్కడా చెడ్డ తల్లి ఉండదమ్మా అని. అమ్మ ప్రేమ స్వరూపిణి.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ