🙏"శ్రీమాత్రేనమః"🙏
" నాదరూపిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 901 వ నామం.
" నాదరూపిణీ " అంటే కేవలనాదస్వరూపురాలు. అమ్మవారు నాదరూపంలో అందరిలోనూ ఉంటారు. శబ్దానికి పూర్వస్థితి నాదం. నాదం శబ్దరూపంలో బయటకు వస్తే పాట, స్తోత్రం, మంత్రం అవుతుంది.
అమ్మవారి రూపమయిన నాదసాధనతో దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్య, అన్నమయ్య వంటివారు తరించారు, చిరస్మరణీయులయారు. కీర్తనం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉండి విని ఆనందిస్తూ ఉంటారు.
శిశువు ఎంత బాధలో ఉన్నా అమ్మ మాట, పాట వినబడగానే ఠక్కున ఆపేస్తాడు ఏడుపుని. అమ్మ జోలపాటకు చక్కగా నిద్రపోతాడు. అంత మహత్తు నాదానికి.
" శంకరా! నాదశరీరా
పరా వేదవిహారా హరా
జీవేశ్వరా ప్రాణము నీవని,
గానమె నీదని, ప్రాణమె
గానమని మౌన విచక్షణ,
ధ్యాన విలక్షణ, రాగమే
యోగమని నాదోపాసన
చేసినవాడను, నీవాడను నేనైతే "
అని వేడుకున్నారు శంకరశాస్త్రి గారు.
కృష్ణోపనిషద్ " మోక్షం/ముక్తి/జన్మరాహిత్యం పొందే సమయం ఆసన్నమయినప్పుడు వేణునాదం వినబడుతుంది జీవుడికి " అని తెలియచేస్తూ ఉంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment