విగ్రహం భక్తులకు ఆలంబన - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" లీలావిగ్రహధారిణీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య

నామాల్లో 865 వ నామం.

" లీలా " అంటే అనాయాసంగా అని అర్ధం. భక్తులని అనుగ్రహించడానికి, తరింపచేయడానికి అమ్మవారు ఓ రూపాన్ని తీసుకుని " ఆలంబన " కలిగిస్తారు.

ఇందరు దేవుళ్ళు అవసరమా, విగ్రహారాధనకి అర్ధం ఉందా అని కొందరు కుహనా మేధావులు అంటూంటారు/అనుకుంటూంటారు.

ఈ విషయం గురించి మాట్లాడుతూ పూజ్యులు సామవేదం వారు ఒక చక్కటి విషయం తెలియచేసారు. దీనిని " డేవిడ్ ఫ్రాలే " గారి అభిప్రాయంగా చెప్పారు.

" మంచు " అంటే ఏమిటి అని ఎవరినైనా ( మనల్ని అయినా ) అడిగితే వెంటనే చెప్పేది " తెల్లగా చల్లగా ఉంటుంది, వేడితగిలితే కరిగి నీరవుతుంది " అని. ఇదే విషయాన్ని ధృవప్రాంతాల్లో ఉండే " ఎస్కిమోలని " అడిగితే వారు " ఏ మంచు " గురించి అడుగుతున్నారు అంటారు. ఎందుకంటే మంచులో 48 రకాలు ఉన్నాయి కనుక. మంచులోనే జీవిస్తూ దానితో మమేకం అవడంవల్ల, మంచుతో ఉన్న సాన్నిహిత్యం వలన వారికి తేడాలు తెలుస్తాయి.

అలాగే మన ఋషులు వారి జ్ఞానంతో, ధ్యానంతో, సన్నిహితత్వంతో ఎందరో దేవీదేవతలను దర్శించారు, చూసారు. అవే విషయాలను మనకు తెలియచేసారు. ఏ దేవీదేవతలను ఎలా సేవించుకుంటే తరించగలరో కూడా తెలియచేసారు.

వివేకానందుడు అదే అన్నారు " మేము విగ్రహాన్ని దేవుడుగా చూడం, విగ్రహంలోని దేవుడిని చూస్తాం " అని.

అసలు విగ్రహం దేనికి? ధ్యానం చెయ్యాలన్నా తరించాలన్నా ఒక " ఆలంబన " అవసరం. ఉదా.కి సూర్యుడిని ఊహించుకోవడం వేరు, నేరుగా దర్శించుకోవడం వేరు. అదే మన శాస్త్రాలు తెలియచేసినది.

అలాగే ఒకరు అందరు దేవీదేవతలను పూజించరు. వారు సులువుగా తరించడానికి ఒక దేవుడిని " ఆలంబన " గా చేసుకుని వారి అనుగ్రహం పొంది తరిస్తారు. 

పాండ్యదేశంలోని సోమదేవశాస్త్రిగారు లలితాదేవి ఉపాసకుడు. " బాల " రూపంలో ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేదిట అమ్మవారు.

త్యాగయ్య ఒక్క శ్రీరాముడిని నమ్ముకుని 96 కోట్ల రామజపం చేసి తరించారు/ధన్యుడయారు. అన్నమయ్య వెంకటేశ్వరుడిని, శ్యామశాస్త్రి మీనాక్షి అమ్మవారిని, ముత్తుస్వామి దీక్షితర్ కుమారస్వామిని, మీరాబాయి శ్రీకృష్ణుడిని సేవించుకుని ధన్యజీవులయారు, నేటికీ కీర్తింపబడుతున్నారు. 

ఇటువంటి దృష్టాంతాల్ని చూసికూడా ఆచరించి తరిద్దామనే ఆలోచనలు కొందరికి రావడంలేదంటే ఇంకా వారు ఎత్తవలసిన " నీచ " జన్మలు మిగిలి ఉన్నాయని అనుకోవడంలో తప్పులేదు. అటువంటివారిని కూడా అజ్ఞానం ( మాయ ) లోంచి బయటపడవేసి అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ