అమ్మవారికి అమ్మవారే సాటి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నిస్తులా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 184 వ నామం .

" నిస్తులా " అంటే సాటిలేనిది, ఉపమానము లేనిది అని అర్థం. లోపరహితమయిన ఈ సృష్టిచక్రాన్నంతా ఒంటి చేతితో నడిపిస్తున్నారు అమ్మవారు. అమ్మవారికి సాటి ఎవరయినా ఉన్నారా అనే ఆలోచనే సరికాదు. అమ్మవారు ఏర్పాటుచేసిన భూమి నీరు గాలి లోహాలు తప్ప వేల సంవత్సరాలు అయినా క్రొత్తదేమీ కనిపెట్టలేకపోతున్నారు.

వేదంలో " న తస్య ప్రతిమా అస్తి ( యజుర్వేదం 32:3 )" అని ఉంది. ప్రతిమ అంటే విగ్రహం అనుకుని వేదాలలోనే దేముడికి విగ్రహం లేదు అని ఉంది, విగ్రహారాధన ఏమిటి అని కొందరు వితండవాదం చేస్తున్నారు. ఇక్కడ ప్రతిమ అంటే విగ్రహం అని కాదు, సాటి - ఉపమానం లేదు అని.

అర్జునుడు పరమాత్మ విశ్వరూపం చూసి ఇలా ప్రార్థిస్తాడు:

" పితాసి లోకస్య చరాచరస్య

  త్వమస్య పూజ్యశ్చ   

  గురుర్గరీయాన్,

  న త్వత్సమోఽస్త్యభ్యధికః   

  కుతోఽన్యోలోకత్రయేఽప్య   

  ప్రతిమప్రభావ "

            - భ.గీత 11:43

" నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠమైన ఆరాధ్య యోగ్యుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు, నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? " అని.

" ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " - సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదు, " సర్వం ఈశావాస్యం " - సృష్టి అంతా ఒకే చైతన్యంతో నిండి ఉంది అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు.

అమ్మవారికి అమ్మవారే సాటి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ