ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం కష్టం కాదు - చీమలపొటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" అపి చేత్ సుదురాచారో     

  భజతే మామనన్యభాక్,

  సాధురేవ స మంతవ్యః  

  సమ్యగ్వ్యవసితో  హి సః "

              - భ.గీత 9:30

" మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని  సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన, యధార్ధముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో  సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు " అని.

గరుడపురాణం నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అద్భుత విషయాన్ని తెలియచేసింది:

" తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ, 

  యతేత మృత్యోరవిపధ్యరాత్మనా "

" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని.

రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి.

ప్రాయశ్చిత్తాలు ఏమీ అంత కష్టమయినవి కావు. పూజలు వ్రతాలు చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, నామజపం పారాయణం, సహాయం ఆశించి వచ్చినవారికి శక్తికి తగ్గ సహాయం చేయడం, ఇంటికి వచ్చిన అతిథులను నవ్వుతూ పలకరించడం, ఆవసరమయిన వారికి వీలును బట్టి అన్నదానం, ధనసహాయం చేయడం, మనసులో కూడా ఇతరులకు కీడు జరగాలని కోరుకోకపోవడం లాంటివి చేయడం వల్ల పాపాలు క్రమేపి నశించడం జరుగుతుంది. సద్గతి లభిస్తుంది. 

ఈరోజు పవిత్రమయిన తొలి ఏకాదశి. అందరినీ చల్లగా చూడమని ఆ పరమాత్మను వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ