ఆచరణాత్మక జ్ఞానం కూడా గొప్పదే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అమతిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 537 వ నామం .

" అమతిః " అంటే అవిద్యాస్వరూపురాలు అని అర్ధం.

విద్య అంటే కేవలం అమ్మవారి గురించి తెలుసుకునే జ్ఞానం మాత్రమే అని వేదం చెబుతూంది. మిగతావన్నీ అవిద్యలే. ఉద్యోగాల కోసం మనం చదివే చదువులన్నీ ఎంత పెద్దవి అయినా అవిద్యలే.

మరి అమ్మవారు విద్యాస్వరూపురాలు కాని అవిద్యాస్వరూపురాలు ఎలా?. 

సైద్ధాంతిక జ్ఞానం వేదం, పురాణాలు, పుస్తకాలు, గురువు నుండి పొందవచ్చు. ఆచరణాత్మక సాక్షాత్కారం సాధనతో వస్తుంది. 

అమ్మవారి అంశ/చైతన్యం పండితులలోనే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలలో కూడా ఉంటుంది. మరి సాలెపురుగు తన రక్షణ, ఆహారం కోసం చక్కటి గూడు ఎలా అల్లుకుంటూంది. పక్షి తమ పిల్లల కోసం గూడు ఎలా కట్టుకుంటూంది. వీటికి పుస్తక/బ్రహ్మ జ్ఞానం లేదు. సాధనజ్ఞానం ఉంది. దానిని అమ్మవారు " అవిద్యాస్వరూపురాలు " గా ప్రసాదిస్తారు.

పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" న హి జ్ఞానేన సదృశం 

  పవిత్రమిః విద్యతే,

  తత్స్వయం యోగసంసిద్ధ: 

  కాలేనాత్మని విన్దతి "

           - భ.గీత 4:38

ఈ ప్రపంచంలో దైవిక జ్ఞానానికి సమానమైన శుద్ధి మరొకటి లేదు. సుదీర్ఘమైన యోగాభ్యాసం ( సాధన ) ద్వారా మనస్సు యొక్క స్వచ్ఛతను పొందిన వ్యక్తి, తగిన సమయంలో హృదయంలో అటువంటి జ్ఞానాన్ని పొందుతాడు.

రోజూ వంటవండే చదువుకోనివాని వంట వంటపుస్తకాలు బాగా చదివినవారు చేసే వంట కన్నా ఎక్కువ రుచిగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ నిపుణత సాధనతో వస్తుంది. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ