అమ్మవారు సందేహాలను తొలగిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సంశయఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 173 వ నామం.

" సంశయఘ్నీ " అంటే సందేహములను పోగొట్టునది అని అర్ధం. సంశయం అంటే అజ్ఞానం. ఇది ధర్మమా, అధర్మమా, మంచా, చెడా అనేటువంటి అనేక సందేహాలు కలుగుతూంటాయి మనకు. కొన్ని సమస్యలు కలిగినప్పుడు అసలు బయట పడగలమా అనే సందేహం కలుగుతూంటుంది.‌ కాని మనకే ఆశ్చర్యం కలిగేలా బయట పడిపోతూంటాం. 

సమాజానికి మంచికోసం త్యాగాలు చేసిన మంచివారికి కూడా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి‌. కాని కష్టము సుఖమూ కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే అనే భావనే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు కలుగచేస్తుంది.

ఇదే విషయాన్ని పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:

" తద్విద్ధి ప్రణిపాతేన 

  పరిప్రశ్నేన సేవయా, 

  ఉపదేక్ష్యంతి తే జ్ఞానం 

  జ్ఞానినస్తత్త్వదర్శినః " 

          - భ.గీత 4:34

అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని.

అమ్మవారు " గురురూపిణి ". ఎటువంటి సంశయాన్ని అయినా తొలగిస్తుంది.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి సమస్యలు మరీ ఎక్కువగా లేకుండా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ