అమ్మవారు అనవసర బంధాలను తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భవనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 175 వ నామం.

" భవనాశినీ " అంటే సంసార(బంధ)మును నశింపచేయునది అని అర్ధం. నశింపచేయడం అంటే ఎవరినో ఒకరిని చంపేయడం కాదు, బంధాన్ని తగ్గిస్తుంది అని.

అసలు తగ్గించడం దేనికి?.

కపిలమహర్షి తన తల్లికి తత్వం భోదిస్తూ ఇలా తెలియచేసారు:

" ఏవం స్వభరణాకల్పం 

  తత్ కళత్రా యస్తధా

  నాత్రియంతే యధా పూర్వం 

  హీనా సాయివ గోజరం "

గోజరం అంటే ముసలి ఎద్దు. " ఎవరి ఆనందంకోసం అయితే జీవితమంతా ఏదోరకంగా ( అధర్మంగా నైనా ) సంపాదిస్తావో ఆ భార్యాపిల్లలు ముసలితనంలో నిన్ను సంపాదించినప్పుడు చూసినట్లుగా చూడరు. వ్యవసాయదారుడు ముసలి ఎద్దును ప్రక్కన పెట్టినట్లుగా నిన్ను మూలన పడేస్తారు భార్యాపిల్లలు " అన్నారు. 

భార్యాపిల్లల అవసరాలు తీర్చడం భర్త బాధ్యతే. కాని బంధం పెరిగే కొలదీ వారి ఆనందంకోసం పాపకర్మలు/అధర్మసంపాదన ఎక్కువ అవుతాయి. పాపహేతువు. అమ్మవారితో బంధం పెంచుకుంటే ప్రాపంచికబంధాన్ని తగ్గిస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతంగా, జీవితం ధర్మబద్ధంగా ఉంటుంది.

" జరామరణమోక్షాయ            

  మామాశ్రిత్య యతంతి యే,

  తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం  

  అధ్యాత్మం కర్మ చాఖిలం "

              ‌‌ - భ.గీత 7:29

" నన్ను శరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు పురుషులు

ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు " అన్నారు పరమాత్మ గీతలో.

ప్రాపంచికబంధాలు తగ్గేలా అనుగ్రహించమని " భవనాశిని " అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ