అమ్మవారు ఎల్లప్పుడూ భక్తులకు తోడుగా ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సదోదితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 920వ నామం.

" సదోదితా ( సదా + ఉదితా ) అంటే ఎల్లప్పుడూ ప్రకాశించునది అని అర్ధం. ప్రకాశించడం అంటే ఎప్పుడూ మెలకువగా, అప్రమత్తంగా ఉండడం.

14 లోకాలలోని 84 లక్షల జీవరాశుల బాగోగులు సదా చూస్తూ ఉండాలన్నా, తన సృష్టి అంతా లయబద్ధంగా ఆకర్షణీయంగా వింతగొలిపేదిగా ఉండాలన్నా అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉండాలి.

మనం అప్పుడప్పుడు వింటూంటాం, చదువుతూంటాం. ఫలానా నాయకుడు రోజుకు 18 గం.లు పనిచేస్తారు, ఎప్పుడూ ఒకరోజు కూడా సెలవు తీసుకోడు అని. మరి ఒక దేశనాయకుడే అలా ఉండవలసి వస్తే అమ్మవారు ఎంత అప్రమత్తంగా ఉంటారు.

పూజ్యులు గరికిపాటివారు ఓసారి ప్రవచనం చేస్తూ చమత్కారంగా ఓ విషయం తెలియచేసారు. సూర్యుడు ప్రత్యక్షనారాయణుడు కదా ఆయన్ని నమ్ముకుంటే నయమా అమ్మవారిని నమ్ముకుంటే నయమా అని సందేహం కలిగిందిట ఒకాయనకు. ఈయన అన్నారు " రాత్రి మనకు ఏదయినా సమస్య వస్తే ఉదయం సూర్యుడు ఉదయించేదాకా ఆగాలి. అమ్మవారి రక్షణ అయితే 24x7 " అని. 

అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం, నిశ్చింతగా జీవిద్దాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ