వికార సంఘటనలు చూసి కూడా నిగ్రహంతో ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ధీరా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 916 వ నామం. 

ధీరా అంటే ధీరురాలు/పండితురాలు అని అర్ధం.

" పునంతి ధీరాః అపసో మనీషా " - వికారాలకు లొంగిపోని ధృఢమైన చిత్తం, బుద్ధికలిగి ఉండేవారు ధీరులు అని చెబుతూది వేదం. 

" వికారహేతౌ సతి విక్రయంతే

  ఏషాన్నతేతాంసి తవేయ ధీరాః "

            - మహాకవికాళిదాసు 

ఎదురుకుండా వికారాలు కనబడుతూన్నా/జరుగుతూన్నా మనసు చలించనివారు ధీరులు అన్నారు మహాకవి కాళిదాసు.

ఇటువంటి వారిలో అమ్మవారు స్థితులై ఉంటారు. 

పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు:

" జితాత్మనః ప్రశాంతస్య  

  పరమాత్మా సమాహితః,

  శీతోష్ణసుఖదుఃఖేషు        

  తథామానావమానయోః " 

            - భ.గీత 6:7

శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు  ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు పరమాత్మ చక్కగా స్థితుడైయుండును.  

" అగాధమౌ జలనిధిలోన   

  ఆణిముత్య మున్నటులే, శోకానా   

  మరుగున దాగి సుఖమున్నదిలే, ఏదీ   

  తనంతతానై నీ దరికిరాదు, శోధించి   

  సాధించాలి అదియే ధీర గుణం " 

అన్నారు ఓ సినీకవి. అదీ ధీరగుణం అంటే. ఎంత అద్భుత సాహిత్యం.

అటువంటి మానసిక స్థితిని ప్రసాదించమని అందరం అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ