వినాయకచవితి శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏'శ్రీరస్తు శుభమస్తు"🙏

" ఆగచ్ఛోల్కాయ గంధోల్కః 

  పుష్పోల్కో ధూపకోల్కకః, 

  దీపోల్కాయ మహోల్కాయ 

  బలిశ్చాథ విసర్జనం "

  ‌         - గరుడపురాణం 

" పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలుబెట్టు స్వామి " అని చేసే ప్రార్థన ఇది. దీనిలో అధికంగా " ఉల్క " అని అన్నారు. ఉల్క అంటే తేజస్సు.

గణపతి పూజ అంతా ప్రకృతి ఆరాధనే. మట్టి వినాయకుడిని పూజించి నీటిలో నిమజ్జనం చేస్తాం. పూజను పత్రి, గరికతో చేస్తాం. అన్నీ తిరిగి మట్టిలో కలిసిపోయేవే.

ముత్తుస్వామి దీక్షితులు గారు " వాతాపి గణపతిం భజే - హంసధ్వని రాగం, ఆది తాళం " అనే కీర్తనను గణపతిని స్తుతిస్తూ

చేసారు. అందులో " భూతాది సంసేవిత చరణం, భూత భౌతికా ప్రపంచ భరణం " అని కీర్తించారు. దీని అర్ధం " పంచ భూతాలచే సేవింపబడే కాళ్ళు కలిగిన వాడా, పంచ భూతముల ఉనికికి ప్రపంచ వ్యాప్తి కి కారణం అయిన వాడా " అని.‌ పంచభూతముల ఉనికికి, వ్యాప్తికి కారకుడు గణపతి. 

మనం నిముషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాల చొప్పున రోజుకు 21600 శ్వాసలు జరుపుతాం అని యోగశాస్త్రం చెబుతూంది. దీనిలో మొదటి 600 ( అంటే 40 ని.ల శ్వాస ) శ్వాసలకు అధిపతి గణపతి. దేవతలలో గణపతి మొదటివారు కనుక సూర్యోదయం అవగానే మొదటి 40 ని.లు సూర్యమండలాంతర్వర్తి అయిన గణపతిని ఆరాధిస్తే విశేషఫలితాన్ని ఇస్తుంది అని తెలుస్తూంది. అలాగ గణపతిని కూడా ఆదిత్యమండలస్వరూపముగా పూజించడం జరుగుతూంది.

సనాతనధర్మం ప్రకృతిని పూజించమంది, గౌరవించమంది. మన మనుగడకు అవసరమయినవి అన్నింటినీ ప్రకృతే ఇస్తూంది మనకు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అందుకే గణపతిని సూర్యమండలాంతర్వర్తిగా స్మరిస్తూ ప్రకృతిలో దొరికిన సామగ్రితోనే పూజించుకుంటాం.

అదీ మన సనాతనధర్మం విశిష్టత. దానికి సాటి లేదు, రాబోదు.

వినాయకచవితి శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీగణపతిదేవార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ