అమ్మవారు బహునేర్పరి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ప్రగల్భా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 938 వ నామం .

" ప్రగల్భా " అంటే సృష్ట్యాది కర్మలయందు నేర్పు గలది అని అర్ధం చెప్పారు.

" ప్రౌఢత్వాత్ ప్రగల్భ " అన్నారు. అమ్మవారు ఎప్పుడూ ప్రౌఢే కనుక ప్రగల్భ.

బాగుగా ప్రకంటించబడడాన్ని ప్రగల్భం అంటారు. మరీ ప్రగల్భాలు చెప్పకు అనడం వింటూంటాం. అంటే గొప్పలు వద్దు అని. 

అమ్మవారు చేసేవన్నీ గొప్ప పనులే. సందేహం ఏముంది. సృష్ట్యాది కర్మలు అన్నారు. అంటే సృష్టి స్థితి లయలు. సృష్టి ఎలాగూ అద్భుతమే. స్థితి అంతా ఆశ్చర్యమూ, అద్భుతమే. జీవితంలో రకరకాల మలుపులు, వింత వింత సంఘటనలు. ఒక క్షణం సుఖం, ఇంకో క్షణం దుఃఖం. ప్రేమాభిమానాలు, కక్షలు కార్పణ్యాలు. ఒకరిని ఎంతో అభిమానిస్తాం, అదే మనిషిని చిన్న అర్ధంలేని కారణంతో తరువాత ద్వేషిస్తాం, అసహ్యించుకుంటాం. ఈ రోజు ఎంతో ఇష్టపడి కష్టపడి సంపాదించిన వస్తువు తరువాత ఎందుకూ పనికిరానిదిగా అనిపిస్తుంది.

ఇన్ని సమస్యలకు నిలయమయిన జీవితాన్ని ఎంతో మనోహరంగా కనిపించేలా చేస్తారు అమ్మవారు. ఎన్నో బంధాలను అనుబంధాలను కలుగచేస్తారు. వాటికోసం ఎన్నో చేయకూడని పనులు కూడా చేస్తారు మనుషులు. " ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది " అన్నారు ఓ సినీకవి. అలా ఆఖరున మనిషి జీవితం అమ్మవారి నిర్ణయానికి అనుకూలంగా లయకు లోనవుతుంది‌.

సృష్ట్యాది కర్మలను అంత నేర్పుగా మనోహరంగా చేస్తారు అమ్మవారు. అందుకే అమ్మవారు ప్రగల్భ.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ