అమ్మవారు కావ్యకళాస్వరూపురాలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కావ్యకలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 798 వ నామం.

" కావ్యకలా " అంటే కావ్యకళాస్వరూపురాలు, కావ్యరచనా ప్రతిభా స్వరూపురాలు.

" వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు. కావ్యాలలో వాక్యాలు రసాత్మకంగా ఉంటాయి. అటువంటి రసాత్మకతను అమ్మవారు అనుగ్రహిస్తారు.

" పలికెడిది భాగవతం, 

అట పలికించెడివాడు రామభధ్రుండు, 

అట..... " అంటారు పోతనామాత్యుడు. మరి స్వామి అనుగ్రహం లేకపోతే పోతనగారి భాగవతం అంత అద్భుతంగా ఎలా ఉంటుంది.

మహాకవి కాళిదాసు, పోతనామాత్యుడు కూడా " నీ అనుగ్రహం లేకపోతే ఎలా వ్రాయగలమమ్మా " అని కీర్తించేవారుట అమ్మవారిని.

కొందరు సినీ కవులు కూడా అద్భుత సాహిత్యంతో పాటలు వ్రాస్తూంటారు. అది వారి పూర్వజన్మ సుకృతం. కొందరికే అది సాధ్యం.

విశ్వనాధవారు వేదవాక్యాలు చెప్పేవారే మహాకవి. అక్కడక్కడ వేదవాక్యాలు చెప్పేవారు " అక్కడక్కడ మహాకవి " అని తెలియచేసారు. అమ్మవారు వేదమాత. అందుకే వేదం అంత కళాత్మకంగా, రసాత్మకంగా ఉంటుంది.

వాల్మీకి మహర్షి రామాయణంలో రావణుడు సీతమ్మను తీసుకుని పోతూన్న సన్నివేశాన్ని బుధుడు పట్టుకున్న చంద్రగ్రహణంలా ఉందన్నారు. బుధుడు చంద్రుడి కొడుకు. అంటే కొడుకు తండ్రిని పట్టుకున్నట్లుగా ఉంది అని. సీతమ్మ అమ్మవారు. రావణుడు విష్ణువు ద్వారపాలకుడు జయుడు. అంటే కొడుకు తల్లిని పట్టుకున్నట్లు ఉందని. ఎంత అద్భుత భావం. అందుకే రామాయణం మహాకావ్యం, రసాత్మకం.

మనందరి జీవితాలను కూడా రసాత్మకం చేయమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ